ETV Bharat / international

'వైరస్​ వ్యాప్తిపై ఉగ్ర సంస్థల తప్పుడు ప్రచారం' - అమెరికా సంస్థ నివేదిక

సామాజిక మాధ్యమాల వేదికగా ఉగ్రవాద సంస్థలు వైరస్​ వ్యాప్తిపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని అమెరికా పరిశోధన సంస్థ నివేదించింది. ఆయా సంస్థలు వైరస్​ను జీవాయుధంలా ఉపయోగిస్తున్నాయని పేర్కొంది.

terror groups_UN report
'వైరస్​ వ్యాప్తిపై తప్పుడు సమాచారం చేస్తోన్న ఉగ్రవాద సంస్థలు'
author img

By

Published : Nov 19, 2020, 4:37 PM IST

Updated : Nov 19, 2020, 4:47 PM IST

అల్​ఖైదా, ఐసిస్​ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన గ్రూప్​లు... కొవిడ్​ వ్యాప్తిపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఓ అమెరికా సంస్థ నివేదించింది. ' దేవుడిని నమ్మని వారిని వైరస్​ శిక్షిస్తోందని, పశ్చిమ దేశాలపై దేవుడి ఆగ్రహానికి ఈ వైరస్​ ప్రతిరూపమని' ప్రచారం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​లు చేస్తున్నారని పేర్కొంది. కరోనా వైరస్​ను ఉగ్రవాదులు జీవ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని వెల్లడించింది.

'వైరస్​ ఆఫ్ డిస్​ఇన్ఫర్మేషన్'

ఈ మేరకు... 'స్టాప్​ ది వైరస్​ ఆఫ్​ డిస్ ​ఇన్ఫర్మేషన్' అనే పేరుతో నివేదికను విడుదల చేసింది అమెరికా అంతర్గత నేర, న్యాయ పరిశోధన సంస్థ (యూఎన్​ఐసీఆర్​ఐ). ఉగ్రవాద సంస్థలు తమ బలగాన్ని పెంచుకునేందుకు, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోగొట్టేలా చేసేందుకు వైరస్​ను జీవాయుధంలాగా ఉపయోగిస్తున్నాయని వెల్లడించింది.

వైరస్​ 'భగవంతుడు పంపిన సైనికుడు' అని ఐసిల్, అల్​ఖైదా సంబంధిత సంస్థలు చెబుతున్నాయని అమెరికా సంస్థ తన నివేదికలో పేర్కొంది. మరికొందరు... వైరస్​ వ్యాప్తికి విదేశీయులు, వలసదారులు కారణమని వ్యాఖ్యానిస్తున్నారని వెల్లడించింది.

ఇదీ చదవండి:చైనా చేతికి అమెరికా ఆర్మీ రహస్యాలు!

Last Updated : Nov 19, 2020, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.