ETV Bharat / international

'మొదటి మహిళ అయినా.. ఉపాధ్యాయినిగానే కొనసాగుతా' - ఫిల్లీరగ్ల్​గా జిల్

అమెరికాకు ప్రథమ మహిళ అయినా.. తాను ఉపాధ్యాయినిగానే కొనసాగుతానని చెబుతున్నారు జో బైడెన్​​ భార్య జిల్​ బైడెన్. తాను టీచర్​ కాలేదని.. టీచర్​గా పుట్టారని చెప్పుకొచ్చారు.

I saw a gentlemen for the first time says jill biden
'మొదటి మహిళ అయినా ఉపాధ్యాయినిగానే కొనసాగుతా'
author img

By

Published : Jan 19, 2021, 10:41 AM IST

Updated : Jan 19, 2021, 10:53 AM IST

అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు? ఆర్భాటంగా, అట్టహాసంగా, అత్యంత భద్రంగా... కానీ ఆమె అలా లేరు. ఓ టీచర్‌గా రోజూ స్కూల్‌కెళ్లి పాఠాలు చెబుతూ ఉన్నారు. ఎందుకిలా అంటే 'నేను టీచర్‌ కాలేదు... టీచర్‌గా పుట్టాను' అంటారామె. ఇప్పుడు దేశానికే ప్రథమ మహిళ అయినా 'నేను ఉపాధ్యాయినిగానే కొనసాగుతా' అంటున్న జిల్‌ ఎవరో తెలుసా? అమెరికా అధ్యక్షుడి భార్య జిల్‌ బైడెన్‌.

జిల్‌బైడెన్‌ తన జీవితం గురించి ట్విటర్‌ ఖాతాలో రెండే రెండు ముక్కల్లో క్లుప్తంగా చెప్పుకున్నారు. 'నేనో జీవితకాల విద్యావేత్తని. భార్యని, అమ్మని, చెల్లిని'. ఆమె చెప్పినట్టుగా తన జీవితంలో రెండే విషయాలకి ప్రాధాన్యం ఇచ్చారామె. ఒకటి తానేంతో ప్రేమించే ఉపాధ్యాయవృత్తికి. రెండు కుటుంబానికి. జిల్‌ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి జీవితాంతం కట్టుబడి ఉంటారు. ఆ విషయాన్ని ఆమె జీవితమే స్పష్టంగా చెబుతోంది. జిల్‌ని కలిసిన తర్వాత రెండేళ్ల కాలంలో ఐదుసార్లు 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అని అడిగారు బైడెన్‌. కానీ ఆమె ఏ సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నారు.

ఓ బ్లైండ్‌ డేట్‌లో బైడెన్‌ కలిసిన మొదటిరోజే 'అమ్మా నేను మొదటిసారి ఓ జెంటిల్‌మెన్‌ని కలిశాను తెలుసా?' అంటూ సంబరంగా అర్ధరాత్రి ఫోన్‌ చేసి తన తల్లికి చెప్పారామె. అటువంటి అమ్మాయి 'పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే' అనే ఓ నిర్ణయానికి రావడానికి రెండేళ్లు ఎందుకు పట్టినట్టు అనే అనుమానం రావొచ్చు. "బైడెన్‌ని మొదటిసారి చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. కోటు వేసుకొని డేటింగ్‌కి వచ్చిన ఆయన్ని చూసి నవ్వొచ్చింది. ఆయనతో కలిసి సినిమాకి వెళ్లొచ్చేలోపు అతనేంటో అర్థమయ్యింది." అదే విషయాన్ని మా అమ్మతో సంతోషంగా చెప్పాను అని జిల్​ అన్నారు.

jill biden as teacher
పాఠాలు చెబుతోన్న జిల్ బైడెన్

జిల్‌ని 'ఫిల్లీగర్ల్‌', 'టఫ్‌కుకీ' అని కూడా అంటారు. ఫిలడెల్ఫియాలో పెరిగిన అమ్మాయిలను ఫిల్లీగర్ల్‌ (ఫిలడెల్ఫియా పవర్‌గర్ల్‌) అని, ఎవ్వరికీ కొరుకుడు పడకుండా ఉండే అమ్మాయిలను టఫ్‌కుకీ అని ముద్దుగా పిలుచుకుంటారు.

పనిమనిషిలా వెళ్లి... పాఠాలు చెప్పి

'నేనూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినే. ఐదుగురు అక్కచెల్లెళ్లలో పెద్దదాన్ని. ఎన్నో బాధ్యతలుంటాయి. అప్పటికే వివాహబంధంలో ఎదురైన దెబ్బలు నన్ను ఆలోచించేలా చేశాయి. మరోపక్క బైడెన్‌ తన ఏడాది వయసున్న కూతురిని కోల్పోయారు. మిగిలిన మగపిల్లలు మరోసారి తల్లిని కోల్పోకూడదనే నేను త్వరపడలేదు. వంద శాతం నా నిర్ణయం సరైందే అని నిర్ణయించుకోవడానికే ఇంత సమయం పట్టింది' అంటారు జిల్‌. అలా బైడెన్‌ జీవితంలో అడుగుపెట్టిన జిల్‌ ఆయన జీవితంలో ఎన్నో క్లిష్ట సందర్భాల్లో దన్నుగా నిలిచి ధైర్యాన్ని నింపారు. రాజకీయాల్లో ఆయన స్థిరంగా నిలబడటానికి కారణం అయ్యారు.

న్యూజెర్సీలో పుట్టిన జిల్‌ బాల్యమంతా పెన్సిల్వేనియాలోనే గడిచింది. భర్త రాజకీయాల్లో ఒక్కోమెట్టూ ఎదుగుతుంటే తాను కూడా అధ్యాపక వృత్తికి అవసరం అయిన డిగ్రీలు చదువుతూ వచ్చింది. టీచర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. పెళ్లి తర్వాత బైడెన్‌ ఇద్దరి కొడుకులను పెంచుతూనే మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. కూతురు పుట్టిన తర్వాతా ఉద్యోగాన్ని వదిలిపెట్టలేదు. ముగ్గురు పిల్లలను పెంచుతూనే యాభైఐదేళ్ల వయసులో డెలావేర్‌ యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేషన్‌లో డాక్టరేట్‌ చేసింది. భర్త ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా తన గురించి తెలియకుండా జాగ్రత్తపడుతూ పనిమనిషి పేరుతో పాఠాలు చెబుతూ వచ్చింది. వీటితోపాటూ మిలటరీ కుటుంబాలంటే ఆమెకు ఎనలేని ప్రేమ. వారికోసం నిధులు సేకరించేవారు.

ఇదీ చదవండి:

'జో బైడెన్‌కు ఇదో సువర్ణావకాశం'

ప్రమాణస్వీకారానికి ఇంత ఆలస్యం ఎందుకు?

Last Updated : Jan 19, 2021, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.