Father Shot Daughter: ఓ తండ్రి.. కన్న కూతురిని తుపాకీతో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కూతురు అని తెలియక.!
ఓహియోలోని కొలంబస్లో.. ఉదయం 4.30 గంటలకు ఇంట్లో అలారమ్ మోగడం వల్ల నిద్రలేచిన తండ్రి.. ఇంట్లో ఎవరో ఆగంతకుడు కదలికలను గమనించాడు. ఎవరో ఇంట్లోకి దూరినట్టు అనుమానించాడు. అటువైపు కాల్పులు జరిపాడు. కొంతసేపటికి.. అక్కడికి వెళ్లి చూసేసరికి.. కూతురు రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గుర్తించాడు. తాను కాల్చింది సొంత కూతురినేనని తెలుసుకుని విలపించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఇదీ చూడండి : రఫేల్‌కు పోటీగా చైనా జెట్లు కొన్న పాక్