ETV Bharat / international

కరోనా కయ్యం నుంచి వాణిజ్య యుద్ధం దిశగా! - అమెరికా చైనా మాటల యుద్ధం

కరోనాపై అమెరికా-చైనా మధ్య మొదలైన మాటల యుద్ధం... క్రమంగా వాణిజ్య యుద్ధంగా మారుతోంది. చైనా దిగుమతులకు అడ్డుకట్ట వేయాలన్న డిమాండ్​ అగ్రరాజ్యంలో బలంగా వినిపిస్తోంది. కరోనా సంక్షోభానికి కారణమైన చైనా నుంచి పరిహారం రాబట్టాలన్న వాదన ఊపందుకుంది. ఇంతే దీటుగా అమెరికా, ఇతర దేశాలపై ప్రతి దాడి చేస్తోంది చైనా. కరోనా వైరస్​ వ్యాప్తి సంబంధించి అమెరికా, చైనా పరస్పరం నిందించుకుంటున్నాయి. కరోనా విషయంలో చైనా వ్యవహారంపై అమెరికా గుర్రుగా ఉంది. ఖనిజాల దిగుమతిపై చైనాపై ఆధారపడకూడదని అమెరికా చట్టసభ్యులు అధ్యక్షుడు ట్రంప్​నకు సూచించారు. మరోవైపు.. అమెరికా చేస్తోన్న ఆరోపణలపై చైనా ప్రతిదాడికి దిగింది.

us china
'ఖనిజాల కోసం చైనాపై ఆధారపడకపోవటమే మంచిది'
author img

By

Published : Apr 29, 2020, 11:37 AM IST

కరోనాపై మాటల యుద్ధం... క్రమంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధంగా మారుతోంది. చైనా ఉత్పత్తులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్న డిమాండ్ అగ్రరాజ్యంలో‌ బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు కొందరు కీలక చట్టసభ్యులు ట్రంప్‌కు సూచనలు చేశారు. చైనా నిర్లక్ష్యం వల్లే ప్రపంచమంతా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. ఇందుకుగానూ చైనా నుంచి భారీ స్థాయిలో నష్ట పరిహారాన్ని వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు.

దిగుమతులే ఆధారం..

సైనిక ఉత్పత్తుల్లో వాడే అరుదైన మూలకాల విషయంలో చైనాపై అమెరికా భారీ స్థాయిలో ఆధారపడి ఉన్నట్లు 2018 డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ బేస్‌ నివేదిక వెల్లడిస్తున్నట్టు సెనెటర్‌ టెడ్‌ క్రూజ్‌ నేతృత్వంలోని బృందం వివరించింది. ఈ మేరకు అమెరికా రక్షణ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌, ఇంటీరియర్‌ సెక్రటరీ డేవిడ్‌ బెర్న్‌హార్డ్‌ను కలిసి నివేదిక సమర్పించింది.

ఈ విషయంలో చైనాపై ఎంత తక్కువగా ఆధారపడితే.. అమెరికా వ్యూహాత్మక, సైనిక ప్రయోజనాలకు అంత మంచిదని సూచించారు క్రూజ్ బృందంలోని సభ్యులు.

చైనా రుణాలను నిలిపేయాలి..

మరోవైపు చైనా నుంచి నష్టపరిహారం వసూలు చేయాల్సిందేనని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు బ్రియాన్‌ మాస్ట్‌ అనే ప్రతినిధి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చైనాకు కట్టాల్సిన రుణాలను నిలిపివేసి.. తద్వారా కొవిడ్‌-19 వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని తీర్మానంలో సూచించారు.

మా ప్రయత్నాలను చైనా నీరుగార్చింది..

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు తీవ్రం చేశారు. చైనా చేసిన తప్పు వల్ల 184 దేశాలు ప్రభావితమయ్యాయని మండిపడ్డారు.

"ప్రపంచంలోని 184 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. నమ్మేందుకు ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం. వ్యాప్తి ప్రారంభమైన చైనాలోనే నియంత్రించి ఉండాల్సింది. మూలాలను గుర్తించి అణిచివేసి ఉంటే ఈ నష్టం వాటిల్లేది కాదు. కానీ అది జరగలేదు. ఫలితంగా 184 దేశాలు నరకకూపంలో చిక్కుకున్నాయి."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

వుహాన్​లో వైరస్​ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో అమెరికా నిపుణులు సాయం చేసేందుకు ప్రయత్నించగా.. చైనా తిరస్కరించిందని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు.

"డబ్ల్యూహెచ్​ఓ ప్రతినిధుల పర్యటనలో భాగంగా అమెరికా అధికారులు కూడా చైనాకు వెళ్లారు. ఆ సమయంలో బృందాలుగా వివిధ ప్రాంతాలకు పంపింది. అమెరికా అధికారులను మాత్రం వుహాన్​లో పర్యటించనివ్వలేదు."

- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

చైనా ప్రతిదాడి..

తమపై విమర్శలు చేస్తున్న అమెరికా సహా వేర్వేరు దేశాలపై చైనా ప్రతి దాడికి దిగింది.

"అమెరికా రాజకీయ నాయకులు మొహమాటం లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. కరోనా నియంత్రణ బాధ్యతల నుంచి తప్పించుకోవాలన్నదే అమెరికా నేతల అసలు లక్ష్యం. చర్యలు తీసుకోకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అమెరికా నాయకులు వాళ్ల సమస్యలపై దృష్టి పెట్టి.. మహమ్మారిని త్వరగా నియంత్రించేందుకు ప్రయత్నించటం మంచిది."

- జెంగ్ షువాంగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

కరోనా వైరస్​ వ్యాప్తిని మొదట్లోనే అణచివేయటంలో చైనా విఫలమైందని పలు దేశాలు విమర్శిస్తున్నాయి. ఈ విషయంలో చైనాపై దర్యాప్తు చేయాలని అమెరికా, ఆస్ట్రేలియా డిమాండ్ చేస్తున్నాయి.

ఇదీ చూడండి: కరోనా పుట్టుకలో ఈ మిస్టరీ మహిళల పాత్రేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.