ETV Bharat / international

బోయింగ్​ ఇంజిన్లు అత్యవసరంగా చెక్​ చేయాలని ఆదేశాలు - FAA orders emergency engine checks

బోయింగ్​ 737 విమానాల ఇంజిన్లను అత్యవసరంగా పరీక్షించాలని ఆదేశాలు జారీ చేసింది ఫెడరల్​ ఏవియేషన్​ అథారిటీ. అవసరమైతే ఇంజిన్​ భాగాలను మార్చాలని సూచించింది. ఇంజిన్లు షట్​డౌన్ అవుతున్నాయని నాలుగు నివేదికలు వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

FAA orders emergency engine checks of parked Boeing 737s
బోయింగ్​ ఇంజిన్లు అత్యవసరంగా చెక్​ చేయాలని ఆదేశాలు
author img

By

Published : Jul 25, 2020, 4:44 PM IST

అమెరికాకు చెందిన ప్రముఖ బోయింగ్​ 737 విమానాల ఇంజిన్లలో సమస్యలు తలెత్తుతున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ(ఎఫ్​ఏఏ) తెలిపింది. ఇంజిన్లను అత్యవసరంగా పరీక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ఇంజిన్​ భాగాలను మార్చాలని సూచించింది. విమానాలు ప్రయాణించే సమయంలో ఇంజిన్లు షట్​డౌన్ అవుతున్నట్లు.. నాలుగు నివేదికలు వచ్చిన అనంతరం అప్రమత్తమైంది ఎఫ్ఏఏ.

ఈ ఆదేశాల ద్వారా మొత్తం 2 వేల ట్విన్​ ఇంజిన్​ ప్యాసెంజర్ జెట్ విమానాలపై ప్రభావం పడనున్నట్లు ఎఫ్​ఏఏ స్పష్టం చేసింది. కనీసం ఏడు రోజుల క్రితం పార్కింగ్​ చేసిన విమానాలు, సేవలు పునరుద్ధరించాక 11 సార్ల కంటే తక్కువ ప్రయాణించిన అన్ని బోయింగ్ 737 విమానాలను ఆపరేటర్లు కచ్చితంగా పరీక్షించాలని పేర్కొంది. కొన్ని ఇంజిన్ కవాటాలు బహిరంగ స్థితిలో ఉన్నప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించింది.

కవాటాల్లో తుప్పు వల్ల ఇంజిన్​లు పూర్తిగా శక్తి కోల్పోయి.. రీస్టార్ట్ చేసే సామర్థ్యం లేకుండా తయారవుతున్నట్లు ఎఫ్​ఏఏ పేర్కొంది. ఈ సమస్యల వల్ల పైలట్లు విమానాలను విమానాశ్రయాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ల్యాండ్​ చేయాల్సి వస్తోందని తెలిపింది. అయితే కరోనా సంక్షోభం కారణంగా చాలా విమానాలను వినియోగించలేదని వెల్లడించిన బోయింగ్.. కచ్చితంగా విహంగాల్లోని అన్ని భాగాలను పరీక్షిస్తామంది.

ఇదీ చూడండి: 'విదేశీ విద్యార్థులను దేశంలోకి అనుమతించం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.