అమెరికాలోని ఫ్లోరిడాలో పేలుడు సంభవించింది. 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ షాపింగ్ మాల్లోని రెస్టారెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు సమయంలో రెస్టారెంట్ ఖాళీగా ఉండటం వల్ల భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. గ్యాస్ పైపు పేలడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
పేలుడు ధాటికి రెస్టారెంట్ పూర్తిగా నేలమట్టమైంది. ఆ శిథిలాలు రద్దీగా ఉన్న రోడ్డుపై పడటం వల్ల పరిసర ప్రాంతాల్లోని పలు కార్యాలయాలతో పాటు వాహనాలు దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి:- సంక్షోభం అంచున కర్ణాటక సంకీర్ణ సర్కార్