ETV Bharat / international

'కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధికి భారీ బడ్జెట్ అవసరం'​ - World Health Organization on vaccine

కొవిడ్​-19 మహమ్మారి వ్యాక్సిన్​, చికిత్స సాధనాల కోసం భారీగా నిధులు అవసరమవుతాయని పేర్కొంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు. ఆ దిశగా ప్రపంచ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్​ అభివృద్ధి వేగవంతం చేయకపోతే.. ప్రాణ, ఆర్థిక నష్టం భారీగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

COVID-19 vaccine require big budget
'కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధికి భారీ బడ్జెట్ అవసరం'​
author img

By

Published : Jun 27, 2020, 10:20 AM IST

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నివారించేందుకు వాక్సిన్​ పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్​-19 వ్యాక్సిన్, ఇతర చికిత్స విధానాల​ అభివృద్ధి కోసం భారీగా నిధులు అవసరమని అంతర్జాతీయ వ్యాక్సిన్​ పరిశోధన నిపుణులు పేర్కొన్నారు. నిధుల సమీకరణకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.

కరోనా వ్యాక్సిన్​ తయారీ, నిధుల సమీకరణకు మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతోనే.. ఐరోపా సమాఖ్య సదస్సుకు ఒక్క రోజు ముందు ఈ మేరకు వెల్లడించారు పరిశోధకులు. చొరవ చూపటంలో అమెరికా సైతం దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా చికిత్స సాధనాలు, వ్యాక్సిన్​ అవసరమైన ప్రజలకు ఖర్చుతో నిమిత్తం లేకుండా అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, దాని మిత్ర దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే.. వ్యాక్సిన్​, చికిత్స విధానాలు, ఔషధాల కోసం 2021 చివరి నాటికి సుమారు 31 బిలియన్​ డాలర్లకుపైగా అసరమని అంచనా వేశాయి.

" కొవిడ్​-19 వ్యాక్సిన్​ కోసం తొందరపడకపోతే.. మానవ వనరులు, ఆర్థిక నష్టం మరింత ఎక్కవ అవుతుంది. ఆ సంఖ్య ఊహించుకోవడానికి ఎక్కువగా ఉన్నా.. ఎప్పుడైతే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించిస్తామో ఆ నష్టం అంతగా అనిపించదు. భవిష్యత్​లో ఆర్థిక వ్యవస్థలను పునరుత్తేజనం చేసేందుకు ట్రిలియన్​ డాలర్లు ఖర్చు చేయడంపై ఆలోచించండి. ఇప్పుడు బిలియన్స్​ ఖర్చు చేసినట్లయితే.. ఆ తర్వాత ట్రిలియన్స్​ ఖర్చు చేయాల్సిన అవసరం రాదు."

- డాక్టర్​ న్గోజి ఒకోంజో, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ ప్రత్యేక ప్రతినిధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.