ETV Bharat / international

ఇథియోపియా సైన్యాధిపతి 'మెకోన్నెన్'​ హత్య!

ఇథియోపియా సైన్యాధ్యక్షుడు జనరల్​ సీర్​ మెకోన్నెన్​ హత్యకు గురయ్యారు. రాజధాని అడీస్ అబాబాలో తిరుగుబాటుదారులను అదుపు చేస్తుండగా ఆయన భద్రతా సిబ్బందే... తుపాకితో కాల్చి చంపారని ఆ దేశ ప్రధాని ప్రకటించారు.

ఇథియోపియా సైన్యాధిపతి 'మెనోన్నెస్'​ హత్య!
author img

By

Published : Jun 23, 2019, 11:46 PM IST

ఇథియోపియాలో చెలరేగిన ఘర్షణల్లో ఆ దేశ సైన్యాధ్యక్షుడు, రాజకీయ నేత సీర్‌ మెకోన్నెన్‌ హత్యకు గురయ్యారు. రాజధాని అడీస్‌ అబాబాలో ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరు ఆయనను తుపాకితో కాల్చి చంపాడు. ఇథియోపియా ఉత్తర ప్రాంతం అంహారాలో ఓ జాతికి చెందిన తిరుగుబాటుదారులు స్థానిక ప్రభుత్వ అధికారులపై చేస్తోన్న దాడిని అడ్డుకునే క్రమంలో మెకోన్నెన్​ ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ప్రధాని అబియ్‌ అహ్మద్‌ ప్రకటించారు.

అంహారా గవర్నర్‌ అంబచ్యూ మెకోన్నెన్‌తో పలువురు అధికారులు కీలక సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో గవర్నర్‌తో పాటు పలువురు అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రధాని తెలిపారు. ఈ దాడి వెనుక అంహారా ప్రాంత ప్రధాన భద్రతాధికారి అసామిన్యూ సిగే ఉన్నారని, ఆయనే దీనికి కుట్ర పన్నారని ప్రధాని కార్యాలయం ప్రకటన చేసింది. సైన్యాధ్యక్షుని హత్య నేపథ్యంలో ఇథియోపియా రాజధానిలోని అమెరికా అధికారులు, ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని యూఎస్​ సూచించింది.

అంహారా జాతికి చెందిన వారు ఇథియోపియాలో అత్యధిక సంఖ్యలో ఉంటారు. గత నెల అంహారా, గుముజ్‌ జాతుల ప్రజల మధ్య హింస చెలరేగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా భూములకు సంబంధించిన సమస్యల వల్ల వీరి మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఫలితంగా అనేక మంది తమ ప్రాంతాలను వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు.

2018లో ఇథియోపియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అమియ్‌ అహ్మద్‌.. దేశంలో ఘర్షణపూరిత వాతావరణాన్ని తగ్గించడానికి పలు చర్యలు తీసుకున్నారు. రాజకీయ నేరస్థులను జైళ్లలోంచి విడుదల చేయించారు. పలు రాజకీయ పార్టీలపై నిషేధాన్ని ఎత్తివేశారు. వీటికి తోడు సైనిక సిబ్బంది కూడా తమ వేతనాలు పెంచాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చూడండి : వాయుదాడుల తర్వాత.. సముద్రంలో 21 రోజులు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use until 14th July 2019. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Paris, France. 23rd June 2019.
1. 00:00 Kosovare Asslani nutmegs a Sweden team-mate before the start of training and then spins a football on her finger
2. 00:14 Wide of Sweden players before training starts
3. 00:23 Sweden captain Caroline Seger warming up
4. 00:30 Sweden goalkeeper Hedvig Lindahl before training starts
5. 00:41 Caroline Seger jogging
6. 00:51 Sweden players warming up
7. 00:59 Wide of Sweden players warming up
8. 01:07 Sweden head coach Peter Gerhardsson observes training
9. 01:17 Nilla Fischer during pass-and-move exercises
10. 01:27 Wide of Sweden players during pass-and-move exercises
11. 01:36 Kosovare Asslani during pass-and-move exercises
12. 01:44 Hedvig Lindahl during goalkeeper practice
13. 01:56 Sweden players stretching
14. 02:03 Wide of Sweden players stretching
SOURCE: SNTV
DURATION: 02:11
STORYLINE:
Sweden trained in hot and humid conditions on Sunday, a day before their World Cup round of 16 match against Canada at the Parc des Princes in Paris.
The Swedes finished second in Group F, and enjoyed comfortable victories over Chile and Thailand, before suffering a defeat to three-time champions United States.
Sweden have competed at every single World Cup - they were beaten finalists in USA 2003 when they lost to Germany, and also finished third at the 1991 and 2011 tournaments.
Sweden and Canada met in March earlier this year at the Algarve Cup, with the North American side victors on that occasion - after a goalless game they won 6-5 on penalties.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.