క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా(Modi us visit 2021) చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి(PM Modi in Washington ) ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సందు.. విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. ఆయనతో పాటు అమెరికా అధికారులు.. ఆర్మీ బ్రిగేడియర్ అనూప్ సింగాల్, ఎయిర్ కమాండర్ అంజన్ భద్ర, నౌకాదళ కమాండర్ నిర్భయా బప్నా, అమెరికా విదేశాంగ శాఖలోని మేనేజ్మెంట్, వనరుల విభాగం డిప్యూటీ టీహెచ్ బ్రియాన్ మెక్కియాన్లు.. హాజరయ్యారు.
![PM Modi in Washington](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13144450_modi1.jpg)
![PM Modi in Washington](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13144450_modi2.jpg)
మోదీ రాక కోసం..
ఓ వైపు చిరుజల్లులు కురుస్తున్నా.. మోదీ రాకకోసం భారత జాతీయ పతాకాలు చేతపట్టుకుని ఎదురుచూశారు అక్కడి ప్రవాస భారతీయులు. వంద మందికిపైగా విమానాశ్రయానికి వచ్చారు. విమానం నుంచి మోదీ దిగుతుండగా.. ఆయనకు మద్దతుగా మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. తన కోసం వేచి చూస్తున్న వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు మోదీ.
![PM Modi in Washington](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13144450_modi6.jpg)
![PM Modi in Washington](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13144450_modi3.jpg)
![PM Modi in Washington](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13144450_modi5.png)
" వాషింగ్టన్లో నాకు స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు కృతజ్ఞతలు. మన ప్రవాసులే మనకు బలం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ ప్రత్యేకతను చాటుకోవటం అభినందనీయం "
- ప్రధాని మోదీ.
అనంతరం విమానాశ్రయం నుంచి వాషింగ్టన్‌లోని హోటల్‌కు చేరుకున్నారు మోదీ. భారతీయ సంప్రదాయ చీర కట్టులో అక్కడి సిబ్బంది మోదీకి స్వాగతం పలికారు.
![PM Modi in Washington](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13144450_modi4.png)
నాలుగు రోజుల పర్యటన..
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా క్వాడ్ సదస్సు సహా ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశం, ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు మోదీ.
ఇదీ చూడండి: Modi US visit: మోదీ అమెరికా పర్యటన సాగనుందిలా..