అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో మారోసారి భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటల 19 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.1గా నమోదైంది.
రెండు రోజుల్లో...
దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో భూకంపాల వల్ల రెండు రోజులుగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదైంది. గత 20 ఏళ్లలోనే ఇదే అతిపెద్ద భూకంపమని అధికారులు ప్రకటించారు. తాజా భూకంపం ఆ లెక్కలను చెరిపేసింది.
ఇదీ చూడండి:- 'అచ్చం కపిల్‌దేవ్ లాగే ఉన్నాడుగా'