అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump latest news).. సొంత సామాజిక మాధ్యమ వేదికను ప్రకటించారు. 'ట్రూత్ సోషల్'ను(truth social media) త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ట్రంప్‌నకు చెందిన టీఎమ్‌టీజీ(ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్)-డిజిటల్ వరల్డ్ విలీన ఒప్పందం కుదుర్చుకున్నాయి(trump social media app).
ఈ సంస్థకు ట్రంప్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బడా సంస్థల నిరంకుశత్వాన్ని అడ్డుకునేందుకే ట్రూత్ సోషల్ను తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.
"ట్విట్టర్లో తాలిబన్ల సంఖ్య చాలా ఎక్కువే. కానీ మీ అభిమాన అధ్యక్షుడికి మాత్రం అందులో చోటు లేదు. ఇలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. ట్రూత్ సోషల్ ద్వారా నిజాయతీగల సందేశాలను పంచుకునేందుకు నేను ఎదురుచూస్తున్నా. అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చేందుకే టీఎమ్టీజీని ఏర్పాటు చేశాము."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
ఆ ఘటన తర్వాత...
ఈ ఏడాది జనవరిలో వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌లో హింసాత్మక ఘటన జరిగింది. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్‌లోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. అయితే మద్దతుదారులను రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యాఖ్యానించారని ఆరోపణలున్నాయి. దీంతో ట్రంప్‌ను సామాజిక మాధ్యమాలు బహిష్కరించాయి. అనంతరం ట్రంప్ సొంత సామాజిక మాధ్యమ వేదికను ఏర్పాటు చేసుకుంటారని గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై పలు సందర్భాల్లో సంకేతాలు కూడా ఇచ్చారు ట్రంప్. వీటిని నిజం చేస్తూ తాజాగా.. 'ట్రూత్ సోషల్'ను ప్రకటించారు.