ETV Bharat / international

కుప్పకూలిన మినీ విమానం- 9 మంది దుర్మరణం - విమాన ప్రమాదం

Dominican republic plane crash: డొమినికన్​ రిపబ్లిక్​లోని శాంటో డొమింగోలో ఓ విమానం కుప్పకూలి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ప్రముఖ సంగీత దర్శకుడు జోస్ ఏంజెల్ హెర్నాండెజ్‌ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Dominican plane crash
Dominican plane crash
author img

By

Published : Dec 16, 2021, 10:33 AM IST

Dominican republic plane crash: డొమినికన్​ రిపబ్లిక్​ రాజధాని శాంటో డొమింగోలో ఓ చిన్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ప్యూర్టో రికన్ సంగీత దర్శకుడు జోస్ ఏంజెల్ హెర్నాండెజ్‌తో సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని విమానయాన సంస్థ హెలిడోసా ట్విట్టర్​ వేదిక తెలిపింది.

శాంటో డొమింగోలోని లాస్​ అమెరికాస్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉండగా.. కొద్ది క్షణాల ముందే విమానం కూలిపోయినట్లు పేర్కొంది. ఆ ప్రమాద సమయంలో ఇద్దరు సిబ్బంది సహా తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రమాదానికి కారణాలు ఏంటన్నది చెప్పలేదు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఆ విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి: 'డెల్టా కంటే ఒమిక్రాన్ డేంజర్.. డబ్లింగ్ రేటు రెండు రోజులే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.