అమెరికా జార్జియాలో ఓ శునకానికి.. కరోనా వ్యాధికి కారణమయ్యే వైరస్ 'సార్స్- కోవ్- 2' సంక్రమించినట్లు గుర్తించారు. అమెరికాలో శునకాలకు కరోనా వైరస్ సోకటం ఇది రెండోసారి.
దాని యజమానికి ఇటీవల కరోనా సోకింది. అనంతరం ఆ కుక్క.. నరాల సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుర్తించారు అధికారులు. పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ కుక్కలో కనిపించిన నరాల సంబంధిత అనారోగ్యం.. కరోనా వల్ల వచ్చింది కాదని స్పష్టం చేశారు.
అవకాశం తక్కువే..
పెంపుడు జంతువుల నుంచి మనుషులకు కరోనా వైరస్ వ్యాప్తి చేసే అవకాశం చాలా తక్కువగా ఉందని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి: పాక్ విదేశాంగ మంత్రికి కరోనా పాజిటివ్