ETV Bharat / international

ఇక మీదట చైనాపై అవే మా విధానాలు: పాంపియో - అమెరికా చైనా

ఇక మీదట చైనాపై "అవిశ్వాసం, ధ్రువీకరణ" వంటి విధానాలను అవలంభించనున్నట్టు అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో వెల్లడించారు. కమ్యూనిస్ట్​ చైనాను మార్చకపోతే.. అదే ప్రపంచ దేశాలను మార్చేస్తుందని హెచ్చరించారు.

'Distrust and verify' will be US new policy to counter China, says Pompeo
చైనాపై ఇక మీదట అవే మా విధానాలు: పాంపియో
author img

By

Published : Jul 24, 2020, 5:15 AM IST

చైనాపై మరోమారు విరుచుకుపడ్డారు అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో. చైనాపై తమ విధానాల్లో మార్పులు ఉంటాయన్న పాంపియో.. ఇక మీదట "అవిశ్వాసం- ధ్రువీకరణ" వంటి పద్ధతులను అవలంభించనున్నట్టు వెల్లడించారు. కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో 'కమ్యూనిస్ట్​ చైనా అండ్​ ద ఫ్రీ వరల్డ్స్​ ఫ్యూచర్​' అంశంపై ప్రసంగించిన అగ్రరాజ్య విదేశాంగమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"చైనా నేతల మాటల కన్నా.. వారి చేష్టలను పరిగణించి మనం చర్యలు చేపట్టాలి. అప్పుడే కమ్యూనిస్ట్​ చైనాను మార్చగలం. సోవియట్​ మీద మాజీ అధ్యక్షుడు రొనాల్డ్​ రీగన్​ 'నమ్ము.. కానీ ధ్రువీకరించుకో' అనే విధానాన్ని పాటించేవారు. చైనా కమ్యూనిస్ట్​ పార్టీ విషయానికొస్తే.. పాత విధానాలు విఫలమయ్యాయి. అందువల్ల చైనాపై 'అవిశ్వాసం- ధ్రువీకరించుకోవడం' అనే విధానాలను పాటించాలని నేను అంటాను."

--- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి.

చైనా కమ్యూనిస్ట్​ పార్టీ.. తన ప్రవర్తనను మార్చుకునే విధంగా ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు పాంపియో. ఒకవేళ ప్రపంచ దేశాలు కమ్యూనిస్ట్​ చైనాను మార్చకపోతే.. అదే ప్రపంచాన్ని మార్చేస్తుందని హెచ్చరించారు.

చైనాలో పెట్టుబడులు పెడితే.. ఆయా సంస్థలు కమ్యూనిస్ట్​ పార్టీ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన చర్యలను సమర్థించినట్టేనని అభిప్రాయపడ్డారు పాంపియో. ఉయగర్లు అధికంగా ఉండే జిన్​జియాంగ్​ రాష్ట్రంలో చైనా పాల్పడుతున్న దారుణ చర్యల నేపథ్యంలో పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు.

"మానవ హక్కులను ఉల్లంఘిస్తూ, అమెరికాకు నష్టం చేకూరుస్తున్న చైనా నేతలను బ్లాక్​లిస్టులో జోడించి, ఆంక్షలు విధించాయి ఖజానా-వాణిజ్య శాఖలు. వ్యాపార సూచన మేరకు అనేక కంపెనీల సీఈఓలకు ఈ విషయాన్ని(పెట్టుబడులు పెట్టడం) ముందుగానే తెలియజేశాం."

--- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగశాఖ

పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ).. ప్రజలను రక్షించడం మానేసి.. చైనా భూభాగాన్ని విస్తరించే పనిలో పడిందన్నారు పాంపియో.

ఇదీ చూడండి:- 'అమెరికాలో మరిన్ని చైనా కాన్సులేట్‌లు బంద్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.