ETV Bharat / international

కమలా హ్యారిస్​ ఎంపికపై ఇండో-అమెరికన్లలో భిన్నాభిప్రాయాలు - joe biden latest news

కమలా హ్యారిస్.. ప్రస్తుతం చర్చల్లో నిలుస్తున్న పేరు. అమెరికా అధక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయడమే ఇందుకు కారణం. అయితే ఈమె ఎంపికపై ఇండో-అమెరికన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఈ సెనేటర్​ ట్రాక్​ రికార్డు పరిశీలించాక.. హ్యారిస్​ నుంచి భారతీయులకు సరైన మద్దతు లభించదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Democrats' VP pick Kamala Harris evokes mixed reactions among Indian-Americans
కమలా హ్యారిస్​ ఎంపికపై ఇండో-అమెరికన్ల భిన్నాభిప్రాయాలు
author img

By

Published : Aug 16, 2020, 5:27 PM IST

నవంబర్​లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్​‌ పోటీపడనున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ తరపున హ్యారిస్​ కీలక స్థానంలో పోటీ పడుతున్నట్లు ప్రకటించారు అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌. అయితే 55 ఏళ్ల హ్యారిస్​ను అభ్యర్థిగా ప్రకటించడంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. సుమారు 13లక్షల మంది భారతీయ అమెరికన్లు నవంబర్​లో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన భారతీయ అమెరికన్లతో పాటు నల్లజాతీయుల ఓటర్లను ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే హ్యారిస్​ ఎంపికతో భారతీయులకు ఒరిగేదేమి లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భిన్నాభిప్రాయాలు..

ఇండో అమెరికన్లలో కొందరు హ్యారిస్​ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే సందిగ్ధంలో ఉన్నారు. హ్యారిస్​.. తనను తాను ఎప్పుడూ భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా చెప్పుకోలేదని అభిప్రాయపడ్డారు. కమలా హ్యారిస్​ ఎంపికపై కొంతమంది హర్షం వ్యక్తం చేయగా.. చాలా మంది ప్రశ్నలు గుప్పిస్తున్నారు. భారతీయుల సమస్యలపై ఆమె ఎలా స్పందిస్తారో? అంటూ ప్రశ్నిస్తున్నారు.

"డెమొక్రటిక్ పార్టీ 'ఐడెంటిటీ పాలిటిక్స్'పై ఆధారపడటం హ్యారిస్​ ప్రచారాన్ని బలహీనం చేస్తుంది. ఎందుకంటే ఆమె భారతీయ, ఆసియా, జమైకా, ఆఫ్రికన్-అమెరికన్​ మహిళగా మారారు. ఈ వర్గాలలోని విభజనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కమలా తాను హిందూ లేదా భారతీయ వారసత్వాన్ని పొందడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. కానీ ప్రజలే వారి ఆలోచనలను ఆమెపై రుద్దుతున్నారు. డెమొక్రటిక్ పార్టీ విధానాలే కమలా హ్యారిస్​ ఎన్నికను నిర్ణయించటానికి ఆధారం. అయితే సంప్రదాయవాదులు ఆమెకు మద్దతు ఇవ్వరు."

--రాధా దీక్షిత్​, ఇండో-అమెరికన్​ కన్జర్వేటివ్స్​ ఆఫ్​ టెక్సాస్​ వ్యవస్థాపక సభ్యురాలు.

హ్యారిస్ ఎంపిక పట్ల సంతోషంగా ఉన్నా.. ఆమె రాజకీయ విధివిధానాలతో సంతోషంగా లేనని చెప్పుకొచ్చారు ఓక్లహోమా స్టేట్ యూనివర్శిటీలో రీజెంట్స్ ప్రొఫెసర్​ సుభాష్​.

"భారతదేశానికి అనుకూలంగా లేని రాజకీయం బృందంలో ఆమె ఉండటం వల్ల చాలా నిరాశపడ్డాను. అజెండాను రూపొందించిన జో బైడెన్‌తో ఆమెకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే అందులో యూఎస్​, భారత్​ మధ్య ప్రత్యేక సంబంధం గురించి వారి నుంచి ఎలాంటి ప్రస్తావన లేదు".

-- సుభాష్ కాక్​, పద్మశ్రీ అవార్డు గ్రహీత (ఓక్లహోమా స్టేట్ యూనివర్శిటీలో రీజెంట్స్ ప్రొఫెసర్​)

హ్యారిస్​ ఎంపిక ఇండియన్​-అమెరికన్​ ఓట్లను చీల్చేందుకు డెమొక్రాట్లు వేసిన పెద్ద పథకంగా అభివర్ణించారు అమెరికన్స్​ ఫర్​ హిందూస్​ ఫౌండర్​ ఆదిత్య సత్సంగి.

"హ్యారిస్​ ఎప్పుడూ భారత్​ కాకుండా ఆఫ్రికా సంతతికి చెందిన వ్యక్తిగానే చెప్పుకుంటారు. కాలిఫోర్నియాలో అటార్నీగా ఉన్నప్పుడు ఆమె ట్రాక్​ రికార్డు సరిగ్గా లేదు. అవినితిని కూడా ఆమె ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్నాయి".

-- ఆదిత్య సత్సంగి, అమెరికన్స్​ ఫర్​ హిందూస్​ ఫౌండర్​.

హ్యారిస్​ నామినేషన్​ అద్భుతమైన నిర్ణయం అయినప్పటికీ.. ఆమె గత రికార్డులు కలవరపెడుతున్నాయని అభిప్రాయపడ్డారు లివింగ్​ ప్లానెట్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకులు కుసుమ్​ వ్యాస్​.

"ఆమె వద్ద బలమైన నాయకత్వ లక్షణాలు ఉండొచ్చు కానీ కశ్మీర్​పై భారత పాలసీలను వ్యతిరేకించే వ్యక్తికి మద్దతివ్వాలా? ఆమె ఎప్పుడూ పాకిస్థాన్​వైపే మాట్లాడతారు. న్యాయపరమైన ఇమ్మిగ్రేషన్​ ప్రక్రియను తీసివేయాలని ఆమె సూచిస్తోంది. ఇది భారత్​ వంటి దేశాలకు పెద్ద దెబ్బ".

-- కుసుమ్​ వ్యాస్​, లివింగ్​ ప్లానెట్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకులు.

"హ్యారిస్​ భారత్​, హిందూ వ్యతిరేక వ్యక్తులకు మద్దతిచ్చారు. తనను నల్లజాతీయురాలిగానే చెప్పుకునే ఆమె ఎప్పుడూ భారత్​లోని తన కుటుంబం గురించి పట్టించుకోలేదు. భారతీయురాలిగా ఎప్పడూ తన గురించి ప్రస్తావించలేదు. కశ్మీరీ హిందువులపై దాడుల గురించి ఆమెకు పెద్దగా అవగాహన లేదు. అందుకే పాక్​కు మద్దుతుగా నిలుస్తున్నారు. హ్యారిస్​ తల్లి భారతీయురాలు అయినంత మాత్రాన ప్రో-పాక్​, ప్రో-చైనాగా ఉన్న వ్యక్తులకు ఇండియన్​ అమెరికన్లు ఓట్లు వేయరు" అని అట్లాంటాకు చెందిన రాధిక చెప్పుకొచ్చారు.

"గతంలో కమలా హ్యారిస్​ విధానాల ఆధారంగా అమెరికన్​ హిందువులు, భారతీయ కమ్యూనిటీపై.. ఆమె నూతన పాలసీలు ఎలా ఉంటాయో చెప్పొచ్చు. భారత ప్రజల కోసం ఆమె పెద్దగా సేవలు చేయలేదు" అని హిందూపాక్ట్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ ఉత్సవ్​ చక్రవర్తి చెప్పారు.

భారత్​ తీసుకొచ్చిన ఆర్టికల్​ 370, పౌరసత్వ సవరణ చట్టాన్ని హ్యారిస్​ వ్యతిరేకించడాన్ని గుర్తుచేసుకున్నారు మరికొందరు. అంతేకాకుండా భారత్​-అమెరికా సత్సంబంధాలపై హ్యారిస్​కు పెద్దగా అవగాహన లేదని అభిప్రాయపడ్డారు. ట్రంప్​-మోదీ బంధం చాలా అత్యుత్తమ స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

కమలా హ్యారిస్‌ ప్రస్తుతం కాలిఫోర్నియా నుంచి డెమొక్రటిక్​ పార్టీ సెనేటర్‌గా ఉన్నారు. జో బైడెన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. కమలా హ్యారిస్​ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశస్థుడు. తమిళనాడుకు చెందిన కమల తల్లి శ్యామలా గోపాలన్‌ 1960లో అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.