ETV Bharat / international

14 భారతీయ భాషలతో బైడెన్​ 'డిజిటల్'​ అస్త్రం - బైడెన్​ ఎన్నికల ప్రచారం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేసింది డెమొక్రటిక్​ పార్టీ. 14 భారతీయ భాషల్లో డిజిటల్​ గ్రాఫిక్స్​ను విడుదల చేసింది. దక్షిణాసియా ఓటర్ల మద్దతును పొందేందుకు ఇవి ఉపయోగపడతాయని జో బైడెన్​ వర్గం ఆశిస్తోంది.

Democrats release digital ads in 14 Indian languages to woo South Asian voters in US
14 భారతీయ భాషలతో బైడెన్​ 'డిజిటల్​ ప్రచారాలు'
author img

By

Published : Sep 22, 2020, 12:28 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థి జో బైడెన్​ను గెలిపించేందుకు డెమొక్రటిక్​ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 14 భారతీయ భాషల్లో డిజిటల్​ గ్రాఫిక్స్​ను విడుదల చేసింది. దేశంలోని దక్షిణాసియా ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆశిస్తోంది.

'చల్​ చలో బైడెన్​ కో ఓట్​ దో'(పదండి.. బైడెన్​కు ఓటు వేద్దాం) అంటూ సాగే ప్రచార గీతాన్ని ఇప్పటికే విడుదల చేయగా.. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని డెమొక్రటిక్​ పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా.. 'జాగో అమెరికా, జాగో, భూల్​ న జానా బైడెన్​-హారిస్​ కో ఓట్​ దేనా'(అమెరికా మేలుకో.. బైడెన్​కు ఓటు వేయడం మర్చిపోకు) వంటి నినాదాలతో 14 భాషల్లో ఈ డిజిటల్​ యాడ్స్​ను విడుదల చేసినట్టు స్పష్టం చేసింది.

"సంగీతం, ఆహారం, భాష, సంప్రదాయానికి సంబంధించిన వాటితో ప్రజలు సులభంగా కలిసిపోతారు. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలకు చేరువ అవుతున్నాం. ఈ డిజిటల్​ గ్రాఫిక్స్​.. దక్షిణాసియా ఓటర్లలో స్ఫూర్తిని నింపుతాయని ఆశిస్తున్నాం. తదుపరి అధ్యక్ష-ఉపాధ్యక్షులుగా బైడెన్​-కమలా హారిస్​ను ఎన్నుకొనేందుకు ఇండో అమెరికన్లు ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారు."

--- అజయ్​ భుటోరియా, బైడెన్​ ప్రచారాల జాతీయ ఆర్థిక కమిటీ సభ్యుడు.

నవంబర్​ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. ఈ నెల 29 నుంచి రిపబ్లికన్​ ట్రంప్​- డెమొక్రాట్​ జో బైడన్​ మధ్య అధ్యక్ష ఎన్నికల్లోనే అత్యంత రసవత్తరమైన సంవాదాలు ప్రారంభంకానున్నాయి.

ఇదీ చూడండి:- 'దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించేదే లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.