ETV Bharat / international

సెనేట్​ను హస్తగతం చేసుకున్న డెమొక్రాట్లు

సెనేట్​ను డెమొక్రాట్లు చేజిక్కించుకున్నారు. కొత్తగా ఎన్నికైన ముగ్గురు సభ్యులతో సెనేట్​లో మెజారిటీ 50-50కి చేరగా.. సభాధ్యక్ష హోదాలో కమలా హారిస్​ ఉండటం వల్ల డెమొక్రాట్లకు ఆధిక్యం లభించింది.

democrats gaining senate control
సెనేట్​ను హస్తగతం చేసుకున్న డెమొక్రాట్లు
author img

By

Published : Jan 21, 2021, 8:21 AM IST

అమెరికా ఎగువ సభ-సెనేట్​ను డెమొక్రాట్లు హస్తగతం చేసుకున్నారు. నూతనంగా ఎన్నికైన ముగ్గురు డెమొక్రటిక్ సభ్యులు తాజాగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో 100 మంది సభ్యులు ఉండే సభలో మెజారిటీ 50-50కి చేరింది. అయితే సెనేట్​కు నేతృత్వం వహించే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. డెమొక్రాటిక్ పార్టీకి చెందినవారు కావడం వల్ల.. వీరికి ఆధిక్యం లభించినట్లైంది. ఏదైనా అంశంపై ఓటింగ్​లో ఓట్లు సమానంగా చీలిపోతే.. సెనేట్ సభాధ్యక్షుడు టై బ్రేకర్ ఓటు వేస్తారు.

అమెరికా ఉభయసభలతో పాటు, శ్వేతసౌధాన్ని డెమొక్రాట్లు చేజిక్కించుకోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. ఇప్పటికే ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు సంపూర్ణ మెజారిటీ ఉంది.

కొత్తగా సెనేట్​లో అడుగుపెట్టినవారిలో జాన్ ఓసోఫ్, రాఫెల్ వార్నాక్, అలెక్స్ పాడిలా ఉన్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన ఓసోఫ్.. జార్జియా నుంచి గెలుపొందారు. అట్లాంటాలోని చర్చిలో పాస్టర్​గా పనిచేసే వార్నాక్ సైతం ఈ రాష్ట్రం నుంచే ఎన్నికయ్యారు. మరోవైపు, సెనేటర్​గా కమలా హారిస్ రాజీనామాతో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏర్పడిన స్థానానికి పాడిలా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమల వైదొలిగిన అనంతరం మిగిలిన కాలం పాటు సెనేటర్​గా కొనసాగుతారు.

ఇవీ చదవండి:

'నవ్య అమెరికాను నిర్మిద్దాం.. నాతో రండి'

46వ అధ్యక్షుడిగా బైడెన్- చరిత్ర సృష్టించిన కమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.