ETV Bharat / international

అభిశంసన: సెనేట్​లో ముగిసిన డెమోక్రాట్ల వాదనలు

author img

By

Published : Jan 25, 2020, 1:29 PM IST

Updated : Feb 18, 2020, 8:45 AM IST

సుదీర్ఘ చర్చ అనంతరం అమెరికా ఎగువసభలో ట్రంప్​ అభిశంసనపై డెమోక్రాట్ల వాదనలు ముగిశాయి. అభిశంసనపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్​ చేశారు డెమోక్రాట్లు. నేటి నుంచి మూడు రోజుల పాటీ ట్రంప్​ తరఫున అటార్నీలు తమ వాదనలను వినిపించనున్నారు.

Democrats conclude opening arguments in Senate impeachment trial
ట్రంప్​ అభిశంసన: సెనేట్​లో ముగిసిన డెమోక్రాట్ల వాదనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసనపై సెనేట్​లో సుదీర్ఘ చర్చ సాగుతోంది. మూడు రోజుల వాడీవేడీ చర్చల అనంతరం డెమొక్రాట్లు తమ వాదనలను పూర్తి చేశారు. ట్రంప్​ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని... ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని హౌజ్ మేనేజర్లు డిమాండ్​ చేశారు.

ట్రంప్​ అభిశంసనపై ప్రతినిధుల సభ న్యాయవిచారణ బృందానికి సారథ్యం వహిస్తున్న అడమ్​ స్కిఫ్... కాంగ్రెస్​ కార్యకలాపాలకు ట్రంప్​ ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

డెమొక్రాట్ల వాదనలు ముగిసిన నేపథ్యంలో నేటి నుంచి ట్రంప్​కు చెందిన అటార్నీలు తమ వాదనలు వినిపించనున్నారు. డెమోక్రాట్లలాగే వీరికీ మూడురోజుల సమయం ఇవ్వనున్నారు.

అమెరికా అధ్యక్షునిపై సెనేట్​లో విచారణ జరగడం ఆ దేశ చరిత్రలో ఇది మూడోసారి. అభిశంసన ప్రక్రియను నెలల తరబడి కొనసాగించడాన్ని ట్రంప్​ తప్పుబట్టారు. తానూ ఏ తప్పూ చేయలేదని.. వెంటనే అభిశంసన తీర్మానాన్ని కొట్టివేయాలని సెనేట్​ను కోరారు.

ట్రంప్​ అభిశంసనకు దిగువ సభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ల మెజారిటీ(53)ఉన్న ఎగువ సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు. ఇందుకు మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం.

ఇదీ చూడండి:- 10 రోజుల్లోనే 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం!

ZCZC
PRI NAT NRG
.BANDA NRG4
UP-COLLISION
2 killed in head-on collision between motorcycles in UP
          Banda, Jan 25 (PTI) Two men were killed after a collision between their motorcycles in Uttar Pradesh's Chitrakoot district, police said on Saturday.
          The accident took place near Sudinpur village under the Bharatkoop police station area on Friday, Station House Officer Sanjay Upadhaya said.
          The deceased have been identified as Raj Karan Yadav (40) and Raghu Yadav (19), he said.
          The bodies have been sent for post-mortem, the SHO said. PTI Corr SAB
AQS
01251216
NNNN
Last Updated : Feb 18, 2020, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.