ETV Bharat / international

Dementia Heart Rate: గుండె వేగంతో మతిమరుపు ముప్పు! - heart attack news

Dementia Heart Rate: విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటే తీవ్రస్థాయి మతిమరుపు(డిమెన్షియా) పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

Dementia Heart Rate
గుండె వేగం
author img

By

Published : Dec 5, 2021, 9:10 AM IST

Dementia Heart Rate: వృద్ధుల్లో విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటే తీవ్ర స్థాయి మతిమరుపు ముప్పు (డిమెన్షియా) పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు గుండె కొట్టుకునే రేటును కొలవడం చాలా సులువు. దాన్ని వ్యాయామం లేదా వైద్య చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో డిమెన్షియా ముప్పు ఉన్నవారిని ముందే గుర్తించి, త్వరగా నయం చేయడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని వివరించారు.

తాజా పరిశోధనలో భాగంగా స్టాక్‌హోంలో 60 ఏళ్లు పైబడ్డ 2,147 మందిపై పరిశీలన జరిపారు. ఆ తర్వాత 12 ఏళ్లకు మరోసారి వారిపై దృష్టిపెట్టారు.

నిమిషానికి 60-69 సార్లు గుండె కొట్టుకునేవారితో పోలిస్తే 80 సార్లు కన్నా ఎక్కువ వేగం కలిగిన వారికి డిమెన్షియా ముప్పు 55 శాతం పెరుగుతుందని వెల్లడైంది. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చూడండి: Omicron Precautions In India: 'ఇవి పాటిస్తే ఒమిక్రాన్​ను అరికట్టొచ్చు..!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.