ETV Bharat / international

Delta Variant: 'అమెరికా ప్రయత్నాలకు ఇది అడ్డంకే' - కరోనా మహమ్మారి

అమెరికాకు డెల్టా వేరియంట్​తో పొంచి ఉన్న ముప్పుపై ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆ వేరియంట్‌ను అడ్డుకొనే అయుధాలు మనచెంత ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకుందామని పిలుపునిచ్చారు.

Delta variant
డెల్టా వేరియంట్
author img

By

Published : Jun 23, 2021, 3:29 PM IST

కరోనా వైరస్‌ను పారదోలడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు డెల్టా వేరియంట్ ముప్పుగా పరిణమించిందని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. "మొదట వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్‌ కంటే డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. అలాగే వ్యాధి తీవ్రతకు కూడా ఇది కారణమవుతోంది. అయితే, ఆ వేరియంట్‌ను అడ్డుకొనే అయుధాలు మనచెంత ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకుందాం" అని ఫౌచీ అన్నారు. ఫైజర్, మోడెర్నా టీకాలతో సహా అమెరికాలో అందుబాటులో ఉన్న టీకాలన్నీ ఈ వేరియంట్‌పై ప్రభావంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.

జులై 4 నాటికి 70 శాతం మంది వయోజనులకు టీకాలు వేయాలనే లక్ష్యాన్ని చేరేందుకు.. అమెరికాకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈ విషయాన్ని శ్వేతసౌధ సీనియర్ సలహాదారు జెఫ్రే జీంట్స్ వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం సోమవారం నాటికి.. 45 శాతం మంది ప్రజలు టీకా రెండుడోసులను పొందారు.

భారత్‌లో రెండోదశలో కరోనా ఉగ్రరూపానికి డెల్టా వేరియంటే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఈ వేరియంట్‌ను మొదట మనదేశంలోనే గుర్తించారు. ఇప్పటికే ఇది పలుదేశాలకు వ్యాపించింది. బ్రిటన్‌లో కొత్త కేసుల పెరుగుదలకు ఇదే కారణమవుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీని విస్తృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి:జంట యాంటీబాడీలతో కొత్త వేరియంట్లకు చెక్​

టీకాలు వేసినా మళ్లీ మళ్లీ కరోనా.. కారణమిదే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.