ETV Bharat / international

జార్జియాలో గురువారమే రీకౌంటింగ్​ ఫలితాలు! - అమెరికా ఎన్నికల ఫలితాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జార్జియాలో ఓట్ల లెక్కింపుపై చేపట్టిన ఆడిట్​ నేటితో ముగియనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చేతితో లెక్కింపు ప్రక్రియ ముగుస్తుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి ఆడిట్​ నివేదికను విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు.

hand tally of presidential race in Georgia
జార్జియాలో గురువారమే ఎన్నికల రీకౌంటింగ్​ ఫలితాలు
author img

By

Published : Nov 19, 2020, 10:24 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జార్జియాలో చేపట్టిన ఆడిట్​ (చేతితో ఓట్ల లెక్కింపు) ప్రక్రియ నేటి రాత్రి నాటికి ముగుస్తుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇది ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు రాష్ట్ర అధికారులను అనుమతిస్తుందని ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

కొత్త చట్టం ప్రకారమే ఆడిట్​..

రాష్ట్రంలో ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఆడిట్​ అవసరమైన 5 మిలియన్ల ఓట్లను చేతితో లెక్కిస్తున్నారు. అయితే ఇది ఎన్నికలపై అనుమానాలు, రీకౌంటింగ్​పై అధికారిక అభ్యర్థనతో మాత్రం కాదని స్పష్టం చేశారు అధికారులు.

రాష్ట్ర ఎన్నికలపై కొత్త చట్టాన్ని గత ఏడాది అమలులోకి తెచ్చారు. అయితే.. చట్టంలో భాగంగా ఆడిట్​ నిర్వహించాలా వద్దా అన్న దానిపై రాష్ట్ర మంత్రిదే తుది నిర్ణయం. అధ్యక్ష ఎన్నికలు ముఖ్యమైనవి, చాలా తక్కువ మార్జిన్​ ఉండటం వల్ల రీకౌంటింగ్​ అవసరంగా భావించినట్లు తెలిపారు రాష్ట్ర మంత్రి బ్రాడ్​ రాఫెన్స్​పెర్గర్​.

గురవారం ఫలితాల ప్రకటన!

ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు శుక్రవారంతో గడువు ముగుస్తున్న క్రమంలో.. ఈ ఆడిట్​ను పూర్తి చేసేందుకు రాష్ట్రంలోని కౌంటీలకు బుధవారం రాత్రి 11.59 గంటల వరకు గడువు ఇచ్చారు. గడువులోపు ఆయా ప్రాంతాలు ఆడిట్​ను పూర్తి చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు అధికారులు. ఈ రీకౌంటింగ్​ నివేదికను రాష్ట్ర మంత్రి కార్యాలయం గురువారం విడుదల చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు.

మార్జిన్​ తక్కువే..

జార్జియాలో మొదట డెమొక్రాటిక్​ అభ్యర్థి జో బైడెన్​కు​.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై 14000 ఓట్ల మెజారిటీతో లభించింది. ఆ తర్వాత డగ్లస్​, ఫయెట్టీ, ఫ్లోయిడ్​, వాల్టన్​ కౌంటీల్లో గతంలో తెరవని బ్యాలెట్లను చేతితో లెక్కించటం వల్ల బైడెన్​ మెజారిటీ స్వల్పంగా తగ్గి 12,800కు చేరుకుంది.

ఫలితాలను ప్రకటించిన తర్వాత జోబైడెన్​, ట్రంప్​ల మధ్య మెజారిటీ మార్జిన్​ 0.5 శాతంగానే ఉండనుంది. ఇందులో ఓటమి పాలైన పార్టీ రీకౌంట్​ చేపట్టాలని కోరేందుకు రెండు రోజుల సమయం ఉంటుంది. చేతితో లెక్కిస్తున్న క్రమంలో వచ్చే ఫలితాలు ప్రతిఒక్కరికి విశ్వాసాన్ని కలిగిస్తాయన్నారు ఎన్నికల అధికారి స్టెర్లింగ్​. అయితే.. అభ్యర్థన వస్తే రీకౌంటింగ్​ చేసే అవకాశం ఉందన్నారు. అలా జరిగితే అది ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని, గతంలో ఎప్పుడూ రాష్ట్రవ్యాప్తంగా రీకౌంటింగ్​ చేపట్టలేదని తెలిపారు.

ఇదీ చూడండి: అలస్కాలో ట్రంప్​ విజయం- జార్జియాలో రీకౌంటింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.