ETV Bharat / international

బీటా వేరియంట్​పై వ్యాక్సిన్లు ప్రభావవంతమేనా? - కరోనా వ్యాక్సిన్​

కొవిడ్​ మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు.. వైరస్​ రూపాంతరం చెందుతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగు చూసిన బీటా వేరియంట్​పై ప్రస్తుత టీకాల ప్రభావంపై పరిశోధన చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. వాటి ప్రభావం అంతంతమాత్రమేనని తేల్చారు.

Beta VAriant
బీటా వేరియంట్​
author img

By

Published : Jun 28, 2021, 2:32 PM IST

కరోనా మహమ్మారి రోజుకో అవతారం ఎత్తుతూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వైరస్​ వేరియంట్లపై ఎంత మేరకు పని చేస్తున్నాయనేదానిపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో.. కొవిడ్​-19కు కారణమయ్యే సార్స్​-కోవ్​-2 వైరస్​ స్పైక్​ ప్రోటిన్​పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగు చూసి బీటా వేరియంట్​పై ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం అంతంతమాత్రమేనని తేల్చారు.

తాజా అధ్యయనం జూన్​ 24న జర్నల్​ సైన్స్​లో ప్రచురితమైంది. క్రైయో-ఎలక్ట్రాన్​ మైక్రోస్కోప్​ ద్వారా.. చైనాలో 2019లో తొలిసారి వెలుగు చూసిన వైరస్​ స్పైక్​ ప్రోటీన్​ను.. బీటా, ఆల్ఫా వేరియంట్లతో పోల్చి చూశారు.. అమెరికాలోని బోస్టన్​ చిల్డ్రెన్స్​ ఆసుపత్రి పరిశోధకులు. B.1.351(బీటా)వేరియంట్​ మ్యుటేషన్లలో స్పైక్​ పలు సందర్భాల్లో తన ఆకృతిని మార్చుకుంటున్నట్లు గుర్తించారు. దాంతో.. ప్రస్తుత వ్యాక్సిన్లతో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు బీటా వైరస్​ను మట్టుబెట్టలేకపోతున్నాయి. వ్యాక్సిన్​ తీసుకున్న వారిలోనూ రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.

" వైరస్​ మ్యూటేషన్లు.. వ్యాక్సిన్లతో ప్రేరేపితమయ్యే యాంటీబాడీలు ప్రభావం చూపకుండా చేస్తాయి. బీటా వేరియంట్​కు కొంత మేర ప్రస్తుత వ్యాక్సిన్లను తట్టుకునే శక్తి ఉంది. ఈ వేరియంట్​ నుంచి రక్షించడానికి కొత్త జన్యు శ్రేణితో ఉన్న బూస్టర్​ ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాం. "

- బింగ్​ చెన్​, బోస్టన్​ చిల్డ్రెన్​ ఆసుపత్రి.

అలాగే.. బీటా వేరియంట్​లోని మ్యూటేషన్లు ఏసీఈ2 గ్రాహకంపై స్పైక్​ ప్రోటీన్​ అంతగా ప్రభావం చూపలేకపోతోందని తేల్చారు. ఈ కారణంగా ఆల్ఫా వేరియంట్​తో పోల్చితే.. తక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఆల్ఫా వేరియంట్​(B.1.1.7) ప్రకారం స్పైక్​ ప్రోటీన్​లోని జన్యుపరమైన మార్పులతో ఏసీఈ2 గ్రాహకంపైకి త్వరగా చేరి ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు.

ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్లతో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ప్రస్తుత వేరియంట్లను తటస్థీకరిస్తున్నట్లు పరీక్షల ద్వారా తేలిందని పరిశోధకులు వెల్లడించారు.

ఇదీ చూడండి: టీకా తీసుకున్నా మాస్క్ తప్పనిసరి.. కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.