ETV Bharat / international

కొవిడ్ టీకాలతో గర్భిణుల్లో గట్టి రక్షణ - శిశువుల్లో యాంటీబాడీలు

ఎంఆర్​ఎన్​ఏ టీకాలు.. గర్భిణులు, పాలిచ్చే తల్లులపై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైంది. ఈ టీకాల ద్వారా శిశువుల్లోనూ యాంటీ బాడీలు విస్తరిస్తున్నట్లు స్పష్టమైంది.

covid vaccine on pregnant women
కొవిడ్ టీకాలతో గర్భిణుల్లో గట్టి రక్షణ
author img

By

Published : Mar 28, 2021, 7:06 AM IST

కొవిడ్-19 నివారణకు రూపొందిన ఎంఆర్ఎన్​ఏ టీకాలు.. గర్భిణులు, పాలిచ్చే తల్లులపై సమర్థంగా పనిచేస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఇవి కరోనా వైరస్​ను అడ్డుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని తేలింది. తల్లిపాలు, మావి ద్వారా శిశువులకూ ఆ రక్షణ ఛత్రం విస్తరిస్తోందని పరిశోధకులు తెలిపారు.

ఫైజర్/బయోఎన్​టెక్ లేదా మోడెర్నా సంస్థలు రూపొందించిన ఎంఆర్​ఎన్​ఏ టీకాలు పొందిన 131 మంది మహిళలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, ఈ విషయాన్ని తేల్చారు. ఈ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ మహిళల్లో చాలా అరుదుగానే టీకా సంబంధ దుష్ప్రభావాలు తలెత్తాయని వివరించారు. తొలుత గర్భిణులు, బాలింతలపై కొవిడ్ టీకా ప్రయోగాలను నిర్వహించలేదని చెప్పారు. తమ అధ్యయనం ఈ కొరతను తీరుస్తోందని పరిశోధనల్లో పాలుపంచుకున్న ఆండ్రియా ఎడ్లో తెలిపారు. గర్భిణుల్లో కొవిడ్ సోకడం వల్ల ఉత్పన్నమయ్యే యాంటీబాడీల స్థాయిని టీకా ద్వారా వెలువడ్డ యాంటీబాడీలతో పోల్చి చూశారు. టీకాల ద్వారానే ఎక్కువ స్పందన ఉంటున్నట్లు తేల్చారు.

ఇదీ చదవండి:శ్మశానంలో పండ్ల తోట.. తగ్గిన ఆహార కొరత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.