ETV Bharat / international

Spanish Flu: స్పానిష్​ ఫ్లూ స్థాయిలో విజృంభిస్తున్న కొవిడ్​ - అమెరికా వార్తలు తాజా

అమెరికాలో 1918-19 మధ్య వచ్చిన స్పానిష్​ ఫ్లూ (Spanish Flu) స్థాయిలోనే ప్రస్తుతం కొవిడ్​ విజృంభిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. డెల్టా వేరియంట్ (america delta variant)​ కారణంగా శీతాకాలంలో వైరస్​ మరింత వ్యాప్తి చెందుతుందని.. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి మరో లక్ష మరణాలు నమోదవుతాయని హెచ్చరించారు.

us covid deaths
అగ్రరాజ్యంలో మరో లక్ష మరణాలు
author img

By

Published : Sep 21, 2021, 11:25 AM IST

1918-19లో వచ్చిన స్పానిష్​ ఫ్లూ (Spanish Flu) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ స్థాయిలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పరిచిన మహమ్మారి కరోనానే అని శాస్త్రవేత్తలు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అయితే అగ్రరాజ్యంపై మాత్రం స్పానిష్​ ఫ్లూతో సమానంగా కరోనా కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. అమెరికాలో కొవిడ్​ కారణంగా నమోదైన మరణాల (us covid deaths) సంఖ్య.. అప్పట్లో వచ్చిన స్పానిష్​ ఫ్లూకు (us spanish flu deaths) దాదాపు సమానంగా ఉందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ల పంపిణీలో జాప్యం జరగడమే ఈ పరిస్థితులకు కారణమని తెలిపారు.

మరో లక్ష మరణాలు..

డెల్టా వేరియంట్​ వ్యాప్తి (america delta variant) తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశంలో రోజుకు సగటున 1,900 మంది ప్రాణాలు కోల్పోతున్నారని జాన్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. సోమవారం నాటికి దేశంలో కొవిడ్​ మరణాల సంఖ్య 6,75,000కి చేరినట్లు పేర్కొన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేశారు.

శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో కొవిడ్​ కేసులు మరింత పెరుగుతాయని వాషింగ్టన్​ విశ్వవిద్యాలయం హెచ్చరించింది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి దేశంలో మరో లక్ష మరణాలు నమోదవుతాయని పేర్కొంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,76,000కి చేరనుంది.

వ్యాక్సినేషన్​ ప్రక్రియను మరింత విస్తృతంగా అమలు చేసి ఉంటే దేశంలో ఈ స్థాయిలో కొవిడ్​ ప్రభావం ఉండకపోయేదని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​కు చెందిన డాక్టర్​ బ్రౌన్​ అభిప్రాయపడ్డారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇప్పటికీ మనకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం అమెరికాలో కేవలం 64 శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్​ మృతుల సంఖ్య 46 లక్షలుగా నమోదైంది. 1918-19 నుంచి మధ్య స్పానిష్​ ఫ్లూ కారణంగా నమోదైన మృతుల సంఖ్య 5 కోట్లుగా ఉంది.

అమెరికాలో కొత్తగా 86,072 కేసులు నమోదయ్యాయి. 1,29,364 మంది కోలుకోగా మరో 746 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,737,027 యాక్టివ్​ కేసులు ఉండగా.. మొత్తం కేసుల సంఖ్య 43,107,628కి చేరింది.

ఇదీ చూడండి : vietnam covid: డెల్టా గుప్పిట్లో వియత్నాం- అందువల్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.