పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోన్నా.. కరోనా విలయతాండవం చేస్తోంది. ఒకరోజు వ్యవధిలో 7 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 14 వేల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 20,16,242కు చేరింది.
- మొత్తం కేసులు: 94,257,919
- యాక్టివ్ కేసులు: 24,927,661
- కొత్తగా నమోదైన కేసులు: 735,381
- మొత్తం మరణాలు: 2,016,242
- అమెరికాలో కరోనా విలయం అదే స్థాయిలో కొనసాగుతోంది. 2,24,756 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,460 మంది బాధితులు మరణించారు.
- బ్రెజిల్లో 68 వేల కేసులు బయటపడ్డాయి. మరో 1,131 మంది ప్రాణాలు కోల్పోయారు.
- యూకేలో 55 వేల పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 1,280 మంది మరణించారు.
పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 24,079,105 | 401,514 |
బ్రెజిల్ | 8,394,253 | 208,291 |
రష్యా | 3,520,531 | 64,495 |
యూకే | 3,316,019 | 87,295 |
ఫ్రాన్స్ | 2,872,941 | 69,949 |