ETV Bharat / international

'కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. 6 నెలలు ప్రాణాంతకమే !'

author img

By

Published : Apr 23, 2021, 10:05 PM IST

కరోనా నుంచి బయటపడినప్పటికీ.. 6 నెలల పాటు ప్రాణాపాయం తప్పినట్లు కాదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ విశ్వవిద్యాలయం పరిశోధనల్లో వెల్లడైనట్లు.. నేచర్ జర్నల్ కథనం తెలిపింది. ఆస్పత్రిలో చేరకుండానే మహమ్మారి నుంచి బయటపడిన వారికి కూడా తొలి 6 మాసాలు ప్రాణాంతకమేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా నుంచి బయటపడిన ప్రతి వెయ్యి మందిలో 30 రోజుల తర్వాత 8 మంది.. 6 నెలల వ్యవధిలో 29 మంది వేర్వేరు అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నట్లు తేలింది.

Washington University, US
వాషింగ్టన్​ విశ్వవిద్యాలయం, అమెరికా

కరోనా మహమ్మారి సోకి ప్రాణాలతో బయటపడినప్పటికీ 6 నెలల పాటు ఎప్పుడైనా పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని అమెరికాకు చెందిన వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయం తెలిపింది. కరోనా సోకినప్పుడు ఆస్పత్రుల్లో చేరేంతగా ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ.. తదుపరి 6 మాసాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు జర్నల్‌ నేచర్‌లో గురువారం కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం.. భవిష్యత్తులో కొన్నేళ్ల పాటు ప్రపంచ జనాభాపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు రూపొందించిన కొవిడ్-19 అనుబంధ రోగాల పట్టిక పరిశీలిస్తే.. కరోనా వల్ల కలిగే దీర్ఘ కాలిక సమస్యల గురించి వెల్లడవుతుందని జర్నల్ తెలిపింది. ప్రస్తుతానికి శ్వాసకోశ వ్యవస్థపై వైరస్ ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. దీర్ఘకాలంలో శరీరంలోని ప్రతి అవయవాన్ని మహమ్మారి ప్రభావితం చేయగలదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ల నుంచి రక్షణ ఎంతకాలం?

87వేల మందిపై..

సుమారు 87 వేల మంది కొవిడ్‌-19 రోగులతో పాటు 50 లక్షల మంది కంట్రోల్ పేషెంట్లపై పరిశోధన చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా చికిత్స తీసుకున్న 6 మాసాల తర్వాత కూడా చిన్నపాటి కొవిడ్ లక్షణాలతో మహమ్మారి బారినపడిన వారితో సహా.. అందరికీ ప్రాణాపాయం పొంచి ఉంటుందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త జియాద్ అల్‌ అలై తెలిపారు. కొవిడ్‌-19 బారినపడి కోలుకున్న తమ రోగుల ఆరోగ్యంపై వైద్యులు కొద్ది మాసాల పాటు పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. ఆ రోగులకు.. సమీకృత, బహుముఖ చికిత్స అవసరమని సూచించారు. కొవిడ్‌-19 బారిన పడిన వారిపై కొద్దివారాల పాటు.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి మహమ్మారి వల్ల కలిగే ప్రమాదాన్ని అంచనా వేసినట్లు అలై స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'కొవిడ్​పై పోరులో భారత్​కు అండగా ఉంటాం'

6 నెలల్లోపు 65 శాతం ఎక్కువ..

కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో అనేక అనుబంధ రోగాలు కూడా పుట్టుకొస్తున్నాయని చెప్పారు. వాటిలో శ్వాస సమస్యలు క్రమరహితమైన గుండె స్పందనలు, మానసికపరమైన సమస్యలు, జుట్టు రాలడం వంటివి ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఇతర పరిశోధనలు అన్నీ కేవలం మానసికపరమైన లేదా గుండెకు సంబంధించిన అంశాల వరకు మాత్రమే పరిమితం కాగా.. తాము ఇతర విషయాలపై కూడా దృష్టిసారించినట్లు పరిశోధకులు వెల్లడించారు. కొవిడ్-19 నుంచి బయటపడిన 30 రోజులలోపు ఉండే ప్రమాదం.. 6 నెలల వ్యవధిలో ఉండే ప్రమాదంతో పోల్చితే 60 శాతం ఎక్కువని అలై వివరించారు.

ఇదీ చదవండి: అంగారకుడిపై ఆక్సిజన్‌ తయారీ!

ప్రతి వెయ్యి మందిలో 8 మంది..

కరోనా నుంచి బయటపడిన ప్రతి వెయ్యి మందిలో 8 మంది వేర్వేరు అనారోగ్య సమస్యల కారణంగా నెలలోపే మరణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకొని మహమ్మారి నుంచి తప్పించుకొని తొలి 30 రోజులు ప్రాణాలతో ఉన్న వెయ్యి మందిలో 29 మంది ఆరు నెలల వ్యవధిలో వేర్వేరు అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే.. ఈ మరణాలు అన్నీ కొవిడ్ కిందకు తీసుకొస్తూ తప్పనిసరిగా రికార్డు చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదన్నట్లుగా పరిస్థితి ఉందని అలై చెప్పారు. ప్రస్తుతం కరోనాతో వెంటనే చనిపోతున్న మరణాలు పరిశీలిస్తే.. అవి కేవలం ఓ మంచు పర్వతంలో చిన్నపాటి భాగంగా మాత్రమే చూడాలని వ్యాఖ్యానించారు.

అమెరికాలోని జాతీయ ఆరోగ్య డేటాబేస్‌ నుంచి సమాచారం సేకరించి ఈ పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. వీరిలో 73,435 మందిలో స్వల్ప లక్షణాలతోనే కరోనా వెలుగుచూసిందని.. వారికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా ఏర్పడలేదని అలై చెప్పారు. పరిశోధనలో శాస్త్రవేత్తలు పరిశీలించిన కేసుల్లో.. 88 శాతం మంది పురుషులు కాగా మిగిలిన వారు మహిళా కరోనా రోగులు.

ఇదీ చదవండి: భారత్​కు టీకా సాయంలో పంతం వీడని అమెరికా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.