ETV Bharat / international

చాపకింద నీరులా కరోనా- 'ఒమిక్రాన్​'తో ఆంక్షల్లోకి దేశాలు!

author img

By

Published : Dec 11, 2021, 11:05 AM IST

Covid-19 surge update: కరోనా మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పటికే పంజా విసురుతోన్న డెల్టాకు.. కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ తోడవుతోంది. అమెరికాతో పాటు చాలా దేశాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రయాణ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఒమిక్రాన్​పై బూస్టర్​ సమర్థంగా పనిచేస్తున్నట్లు పలు అధ్యయనం సూచిస్తున్న​ క్రమంలో డిమాండ్​ పెరుగుతోంది.

covid-19 surge
కరోనా వైరస్​

Covid-19 surge update: అమెరికాలో కొవిడ్​-19 మహమ్మారి పంజా విసురుతోంది. డెల్టాతో పాటు ఒమిక్రాన్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. న్యూయార్క్​లో కొవిడ్​ ఉద్ధృతి మళ్లీ మొదలైంది! ఈ క్రమంలో ఇండోర్​ ప్రాంతాల్లో మాస్క్​లు తప్పనిసరి చేసే అవకాశమున్నట్టు ప్రకటించారు గవర్నర్​ కాథి హోచుల్​. వ్యాపార సముదాయాలు, ఇతర ప్రాంతాల్లో వ్యాక్సిన్​ తప్పనిసరి చేసేంత వరకు మాస్క్​ ఆవశ్యకమని స్పష్టం చేశారు.

కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి.. మాస్క్​ తప్పనిసరి అన్న ఆదేశాలను అమలు చేయాలా వద్దా అన్న విషయం ఆధారపడి ఉంటుందని తెలిపారు హోచుల్​. 2020, ఏప్రిల్​లో న్యూయార్క్​లో మాస్క్​ తప్పనిసరి చేశారు. ఆ తర్వాత 2021 జూన్​లో టీకా తీసుకున్న వారికి మాస్క్​ అవసరం లేదని తెలిపారు. తాజాగా కేసుల పెరుగుదల కనిపిస్తున్నందున సోమవారం(డిసెంబర్​ 12) నుంచి జనవరి 15 వరకు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.

దక్షిణ కొరియాలో..

South Korea coronavirus cases: దక్షిణ కొరియాపై కొవిడ్​ మహమ్మారి పంజా విసురుతోంది. వరుసగా మూడోరోజు 7వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యంత దుర్భర పరిస్థితిగా ప్రభుత్వం పేర్కొంది. కేసులు పెరుగుతున్నా.. ఆంక్షల వైపు ప్రభుత్వం మొగ్గు చూపకపోవటంపై విమర్శలు ఎదురవుతున్నాయి. డెల్టా వేరియంట్​ టీకాల సామర్థ్యాన్ని తగ్గిస్తున్న క్రమంలో బూస్టర్​ డోస్​లకు డిమాండ్​ పెరుగుతోంది. ఒమిక్రాన్​ కేసు బయటపడిన నేపథ్యంలో.. మూడో డోస్​ ఆవశ్యకత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో.. కొవిడ్​ వైరస్​ అదుపులోకి రాకపోతే.. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని కిమ్​ బూ క్యూమ్​ తెలిపారు.

జపాన్​లో కొత్తగా 8 ఒమిక్రాన్​ కేసులు

Japan Omicron: జపాన్​లో ఒమిక్రాన్​ వేరియంట్​ క్రమంగా విస్తరిస్తోంది. కొత్తగా 8 ఒమిక్రాన్​ కేసులు వెలుగు చూసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 12కు చేరినట్లు తెలిపింది. గత నవంబర్​ చివరి వారం నుంచి డిసెంబర్​ తొలినాళ్లలో దేశంలోకి వచ్చిన వారిలో 8 మందికి వైరస్​ పాజిటివ్​గా తెలినట్లు పేర్కొంది. అందులో జపాన్​లో తొలి కేసు వచ్చిన నమీబియా దౌత్యవేత్త ప్రయాణించిన విమానంలోనే ఓ మహిళ, చిన్న పిల్లాడు.. నవంబర్​ 28న వచ్చినట్లు చెప్పారు.

రోమానియాలో ప్రయాణ ఆంక్షలు

Romania Covid restrictions: ఒమిక్రాన్​ వేరియంట్​ భయాలతో దేశంలోకి వస్తున్న విదేశీ ప్రయాణికులపై కొత్త ఆంక్షలు, ఐసోలేషన్ చర్యలను అమలులోకి తీసుకొచ్చింది రోమానియా. గత అక్టోబర్​-నవంబర్​ మధ్య దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు ఒమిక్రాన్​ కేసులు వచ్చాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారికి ఈ వైరస్​ సోకింది. ఆ విమానాల్లో వచ్చిన వారిలో పలువురికి కొవిడ్​ పాజిటివ్​గా తేలిందని, జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం పంపించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రయాణ ఆంక్షలు శుక్రవారం(డిసెంబర్​ 10) నుంచి జనవరి 8 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.

ఇజ్రాయెల్​లో ఆంక్షల పొడిగింపు..

Israel travel restrictions: విదేశీయులు దేశంలోకి ప్రవేశించటంపై నిషేధంతో పాటు అంతర్జాతీయ ప్రయాణాలపై కఠిన ఆంక్షలను మరో 10రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది ఇజ్రాయెల్​. ఒమిక్రాన్​ వేరియంట్​ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఆంక్షలు పొడిగించినట్లు ప్రధాని నెఫ్తాలి బెన్నెట్​, ఆరోగ్య మంత్రి నిట్జాన్​ హోరోవిట్జ్ తెలిపారు​. ఇజ్రాయెల్​ బెన్​-గురియాన్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు డిసెంబర్​ 22 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే స్వదేశీ ప్రయాణికులు కొవిడ్​ పీసీఆర్​ టెస్ట్​లో నెగెటివ్​ వచ్చే వరకు సెల్ఫ్​ క్వారంటైన్​లోనే ఉండాలని తెలిపారు.

దేశంలో ఇప్పటి వరకు 21 ఒమిక్రాన్​ కేసులు వచ్చాయి.

బ్రిటన్​లో మళ్లీ ఆంక్షలు..

UK Covid restrictions: కరోనా వైరస్​ కట్టడికి కఠిన ఆంక్షలను శుక్రవారం నుంచి అమలులోకి తీసుకొచ్చింది బ్రిటన్​. దేశవ్యాప్తంగా విధించిన ఆంక్షలను అధికారులే ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు వస్తున్న క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని బోరిస్​ జాన్సన్​. ఒమిక్రాన్​ వేరియంట్​ను అదుపు చేసేందుకు ఇండోర్​ ప్రాంతాల్లో మాస్క్​ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. నైట్​క్లబ్స్​, పెద్ద కార్యక్రమాల్లో వ్యాక్సినేషన్​ పాసులు తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. వీలైతే ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోం వంటివి అమలు చేయాలని చెప్పారు.

డెల్టాపై ఫైజర్​ బూస్టర్​ డోస్​ 90 శాతం సమర్థత

కొవిడ్​-19 వ్యాక్సిన్​ ఫైజర్​ మూడో డోసు ద్వారా సార్స్​ కోవ్​-2 వైరస్​ డెల్టా వేరియంట్​ ద్వారా సంభవించే మరణాలను 90 శాతం తగ్గిస్తుందని రుజువైనట్లు ఇజ్రాయెల్​ అధ్యయనం తెలిపింది. ఈ పరిశోధన న్యూ ఇంగ్లాండ్​ జర్నల్​ ఆఫ్​ మెడిసిన్​లో గత గురువారం ప్రచురితమైంది. ఐదు నెలల క్రితం పైజర్​ టీకా రెండు డోసులు తీసుకున్న 50 ఏళ్లు ఆపైబడిన వయసు వారి డేటాను సైతం అధ్యయనంలో పేర్కొన్నారు. బూస్టర్​ డోస్​ తీసుకున్న వారు, తీసుకోని వారిలో మరణాలను రేటును పోల్చి చూసి నిర్ధరణకు వచ్చారు. ఈ పరిశోధనలో 843,208 మంది పాల్గొనగా.. 758,118(90శాతం) మంది 54 రోజుల సమయంలో బూస్టర్​ డోస్​ తీసుకున్నారు. అందులో 65 మంది( రోజులో లక్ష మందిలో 0.16 శాతం) ప్రాణాలు కోల్పోయారు. బూస్టర్​ తీసుకోని వారిలో 137 మంది(లక్షల మందిలో 2.98 శాతం) మరణించారు.

బూస్టర్​తో ఒమిక్రాన్​ కట్టడి..

Booster dose omicron: ఒమిక్రాన్​ వేరియంట్​ నుంచి కొవిడ్​-19 వ్యాక్సిన్​ బూస్టర్​ డోస్​ 70-75 శాతం మేర రక్షణ కలిపిస్తోందని బ్రిటన్​ ఆరోగ్య భద్రతా ఏజెన్సీ తెలిపింది. ఆక్స్​ఫర్డ్- ఆస్ట్రాజెనెకా, భారత్​లోని కొవిషీల్డ్​, ఫైజర్​ టీకాలు రెండు డోసులు తీసుకున్న వారిలో డెల్టాతో పోల్చితే.. ఒమిక్రాన్​ లక్షణాలు ఉన్నవారిపై తక్కువ ప్రభావం చూపుతున్నట్లు పేర్కొంది. అయితే.. 581 ఒమిక్రాన్​ కేసులపై చేసిన అధ్యయనం ఆధారంగా కొత్త వేరియంట్​పై బూస్టర్​ డోస్​ రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు నిర్ధరణ అయినట్లు తెలిపింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.