ETV Bharat / international

మాస్కుల పునర్వినియోగానికి 'ఎఫ్​డీఏ' ఆమోదం

author img

By

Published : Apr 14, 2020, 1:19 PM IST

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారితో పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. వైరస్​ నివారణ చర్యల్లో భాగంగా మాస్క్​ కీలకంగా మారింది. ప్రజా వినియోగం దృష్ట్యా.. ఇప్పుడు వీటి కొరత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో వైద్యులు ఉపయోగించే ఎన్​95 మాస్కుల్ని స్టెరిలైజ్​ చేసి తిరిగి వాడేందుకు అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ అంగీకారం తెలిపింది. రోజూ దాదాపు 4 మిలియన్లకుపైగా తొడుగుల్ని శుభ్రపరచాలని పేర్కొంది.

FDA approves decontamination of N95 respirators for reuse
మాస్కుల పునర్వినియోగానికి 'ఎఫ్​డీఏ' ఆమోదం

భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా కట్టడిలో మాస్క్​ ఎంతో కీలకం. ఈ తొడుగులతో వైరస్​ మన దరిచేరకుండా కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్న వేళ.. కీలక సూచనలు చేసింది అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​. ప్రజావసరాల దృష్ట్యా మాస్కుల కొరత ఏర్పడిన నేపథ్యంలో... ఎన్​95 మాస్కుల వినియోగంపై తన అత్యవసర ఆదేశాన్ని జారీ చేసింది. రోజూ దాదాపు 4 మిలియన్ల తొడుగులను స్టెరిలైజ్​(శుభ్రపరచడం) చేయాలని సూచించింది. ఆరోగ్య సేవల సిబ్బంది వీటిని తిరిగి వాడుకోవచ్చని స్పష్టం చేసింది.

''మన దేశంలో కరోనా నుంచి కాపాడేందుకు ఆరోగ్య సిబ్బంది సేవలు మరువలేనివి. వారే నిజమైన హీరోలు. వారికి మెరుగైన సదుపాయాలు అందించడం మన విధి. ఈ నిర్ణయంతో.. మిలియన్ల కొద్దీ మాస్కులు పునఃసృష్టించినట్లవుతుంది. ఫలితంగా కొవిడ్​-19 బాధితులకు మెరుగైన భద్రత, రక్షణ కల్పించేందుకు మరింత దోహదపడుతుంది.''

- ఎఫ్​డీఏ కమిషనర్​ స్టీఫెన్​ హాన్​

స్పష్టత లేదు..

ఒక మాస్కు ఎన్ని రోజులు ధరించాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) స్పష్టంగా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే మాస్కులు వాడిపారేయడం వల్ల కొరతకు దారితీసింది.

భారత్​లోని ఎయిమ్స్​ కూడా మాస్కుల వినియోగంపై ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో మాస్కును నాలుగుసార్లు వాడాలని వైద్యులను కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.