ETV Bharat / international

చైనా దుష్ప్రచారం కట్టడికి అమెరికా సభలో బిల్లు

వివిధ అంశాల్లో చైనా చేస్తున్న తప్పుడు ప్రచారంపై అమెరికా చట్టసభలో రిపబ్లికన్​ నేతలు కీలక బిల్లును ప్రతిపాదించారు. చైనా సహకారంతో ఈ తరహా కార్యకలాపాలు జరుపుతున్న సంస్థలకు చెక్​ పెట్టేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

china, us
చైనా చర్యలపై బిల్లును ప్రతిపాదించిన రిపబ్లికన్లు
author img

By

Published : Feb 25, 2021, 1:29 PM IST

చైనా అనుకూల ప్రచారానికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో అమెరికా చట్టసభ ముందుకు బుధవారం ఓ కీలక బిల్లు వచ్చింది. ఆ దేశ సహకారంతో దుష్ప్రచారం సాగించే సంస్థలపై ఆంక్షలు విధించడమే ఈ బిల్లు బిల్లు ముఖ్య ఉద్దేశం. రిపబ్లికన్​ సభ్యులు జిమ్​ బ్యాంక్స్​, టామ్​ కాటన్​ దీనిని ప్రతిపాదించారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ విదేశీ విభాగమైన యునైటెడ్​ ఫ్రంట్​ వర్క్​ డిపార్ట్​మెంట్​ (యూఎఫ్​డబ్ల్యూడీ) గురించి ఈ బిల్లులో ప్రముఖంగా ప్రస్తావించారు. యూఎఫ్​డబ్ల్యూడీపై ఆంక్షలు విధించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలా లేదా అనే అంశాన్ని విదేశాంగ మంత్రి పరిశీలించాలని బిల్లులో ప్రతిపాదించారు.

"అమెరికాలో నాయకత్వం మారినా చైనాతో పోరాటం ఆగలేదు. చైనా​ వైఖరి బహిర్గతమైంది. చైనాలో జరిగిన ఉయ్​ఘుర్​ ఊచకోత, క్రైస్తవుల అణచివేతలో యునైటెడ్​ ఫ్రంట్​ ప్రత్యక్షంగా పాల్గొంది. ఈ తరహా చర్యలను ప్రపంచవ్యాప్తం చేయడమే చైనా లక్ష్యం"

-జిమ్​ బ్యాంక్స్, రిపబ్లికన్ స్టడీ కమిటీ ఛైర్మన్​

"కొవిడ్​, మైనారటీలు, అమెరికా వ్యాపారాల్లో చొరబాట్లకు సంబంధించిన సమాచారం రహస్యంగా ఉంచేందుకు చైనా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తప్పుడు సమాచారం అందించే దిశగా కార్యకలాపాలు జరుపుతోంది."

-టామ్​ కాటన్, చట్టసభ్యులు

ఇదే అంశంపై ఇటీవల చట్టసభ్యులు మార్క్ రూబియో, మిట్​ రోమ్నీ, చక్​ గ్రాస్లీ, రాబ్​ పోర్ట్​మ్యాన్​ అధ్యక్షుడు బైడెన్​కు లేఖ రాశారు. చైనా ఆధ్వర్యంలో నడిచే కన్ఫూషియస్​ సంస్థలతో అమెరికా విద్యా సంస్థల సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి : వార్త పరిశ్రమల్లో ఫేస్​బుక్​ భారీగా పెట్టుబడులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.