ETV Bharat / international

'ఊపిరి పీల్చినా కరోనా వచ్చే ప్రమాదం!' - 'సాధారణ శ్వాసతోనూ కరోనా వైరస్​​ వ్యాప్తి'

సాధారణంగా శ్వాస తీసుకున్న సందర్భాల్లోనూ కరోనా వైరస్​ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ శాస్త్రవేత్త వెల్లడించారు. ఎప్పుడూ మాస్కులు ధరించి ఉండడమే మేలని హితవు పలికారు.

Coronavirus
'సాధారణ శ్వాసతోనూ కరోనా వైరస్​​ వ్యాప్తి'
author img

By

Published : Apr 4, 2020, 1:01 PM IST

కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందటంపై కీలక విషయాలు వెల్లడించారు అమెరికాకు చెందిన నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​లోని అంటువ్యాధుల విభాగం అధినేత ఆంటోనీ ఫౌసీ. సాధారణంగా శ్వాస తీసుకోవటం, మాట్లాడటం ద్వారానూ కరోనా వైరస్​ వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

" దగ్గు, తుమ్ముల ద్వారానే కాకుండా ప్రజలు సాధారణంగా మాట్లాడిన సందర్భాల్లోనూ వైరస్​ వ్యాప్తి చెందుతుందని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. అందుకే అమెరికా ప్రభుత్వం ప్రతి ఒక్కరూ మాస్కులు వినియోగించాలని సిఫార్సు చేస్తోంది."

- ఆంటోనీ ఫౌసీ, శాస్త్రవేత్త

వైరస్​ వ్యాప్తిపై ఈనెల 1న శ్వేతసౌధానికి.. జాతీయ సైన్స్​ అకాడమీ ఓ నివేదిక సమర్పించింది. సాధారణ శ్వాస ద్వారా వైరస్​ వ్యాప్తి చెందుతుందన్న అంశంపై పలు పరిశోధనల ఫలితాలను విశ్లేషించినప్పటికీ.. పూర్తిస్థాయిలో ధ్రువీకరించలేదని పేర్కొంది. ఇప్పటి వరకు అమెరికా ఆరోగ్య సంస్థలు.. అనారోగ్యంతో ఉన్నవారు తుమ్మినప్పడు, దగ్గిన్నప్పుడు శ్వాసకోశ బిందువుల ద్వారా వైరస్​ మిల్లీమీటర్​ వ్యాసార్ధంలో వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే.. ఒక మీటర్​ దూరంలో వైరస్​ గాలిలోంచి కిందపడిపోతుందని స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి: 'కరోనా కోసం ఆ 2 మందులు కలిపి వాడితే గుండెకు ముప్పు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.