ETV Bharat / international

లాక్​డౌన్​తో పిల్లల్లో ఊబకాయం మరింత తీవ్రం!

కరోనా లాక్​డౌన్​ కారణంగా పిల్లలు, టీనేజర్లలో ఊబకాయం సమస్య మరింత పెరుగుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆహారపు అలవాట్లు మారటం, శారీరక శ్రమ తగ్గటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు గుర్తించింది.

obesity
పిల్లల్లో ఊబకాయం
author img

By

Published : Jun 5, 2020, 5:16 PM IST

కరోనా మహమ్మారి సోకిన వారికే కాకుండా ఇతరులపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. కరోనా లాక్​డౌన్​ వల్ల ఇళ్లకే పరిమితమైన చిన్నారుల్లో ఊబకాయం సమస్య మరింత పెరుగుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆహారపు అలవాట్లు, నిద్రలో మార్పులు, శారీరక శ్రమ తగ్గటం వల్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు స్పష్టం చేసింది.

"ఊబకాయంతో బాధపడే పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు లాక్​డౌన్​ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా వీరికి సహకరించని వాతావరణం ఏర్పడింది. ఆరోగ్యకరమైన జీవనశైలి, అలవాట్లను కొనసాగించటం కుదరడం లేదు. ఫలితంగా ఊబకాయం సమస్య మరింత పెరుగుతోంది. "

- మైల్స్​ ఫేత్, బఫెలో విశ్వవిద్యాలయం పరిశోధకుడు

వేసవి సెలవుల్లో 18 ఏళ్లలోపువారు సాధారణంగానే బరువు పెరుగుతారు. ప్రస్తుతం ఇంటికే పరిమితం కావటం వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఇటలీ వెరోనాలోని 41 మంది చిన్నారులు, టీనేజర్లపై అధ్యయనం చేశారు పరిశోధకులు. మార్చి నుంచి ఏప్రిల్​ వరకు వీరి శారీరక శ్రమ, నిద్ర సమయం, ఆహారపు అలవాట్లు, బరువు వివరాలు సేకరించారు. ఈ ఫలితాలు ఒబెసిటీ అనే జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

మారిన అలవాట్లు..

లాక్​డౌన్​లో అలవాట్లన్నీ ఒక్కసారిగా మారటం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపినట్లు గుర్తించారు పరిశోధకులు. శీతల పానీయాలు, జంక్​ ఫుడ్​, మాంసం అధికంగా తినటం, ఫోన్​, కంప్యూటర్​, టీవీలపై ఎక్కువ సమయం గడపటం వల్ల బరువుపై నియంత్రణ కోల్పోయినట్లు తెలిపారు.

తగ్గిన శారీరక శ్రమ..

బరువు పెరిగే విషయంలో అన్నింటికన్నా ముఖ్యంగా ప్రభావం చూపేది శారీరక శ్రమ. లాక్​డౌన్​ కాలంలో రోజుకు 2.30 గంటలు తగ్గినట్లు గుర్తించారు పరిశోధకులు. లాక్​డౌన్​ వ్యవధిని బట్టి చూస్తే పొందిన అధిక బరువును సులభంగా తిరిగి నియంత్రించలేమని అభిప్రాయపడ్డారు.

ఆరోగ్యకరమైన అలవాట్లను తిరిగి అలవర్చుకోకపోతే యుక్తవయస్సులో ఊబకాయం మరింత సమస్యగా పరిణమిస్తుందని హెచ్చరించారు.

ఇదీ చూడండి: హైడ్రాక్సీక్లోరోక్విన్​ తీసుకుంటే మరణం అపోహే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.