ETV Bharat / international

వీసా ఆంక్షలపై సమాచారం కోసం అమెరికాలో హెల్ప్​లైన్లు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్​లో విధించే ప్రయాణ ఆంక్షలపై సమాచారం కోసం అమెరికాలోని భారత రాయబార కార్యాలయం హెల్ప్​లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. వాషింగ్టన్​​, హ్యూస్టన్​, న్యూయార్క్​, చికాగో, శాన్​ఫ్రాన్సిస్కోలో 24 గంటల హెల్ప్​లైన్​ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

Coronavirus: Indian Embassy sets up helplines to address queries on travel restrictions
వీసా ఆంక్షలపై సమాచారం కోసం అమెరికాలో హెల్ప్​లైన్లు
author img

By

Published : Mar 13, 2020, 10:52 AM IST

కరోనా వైరస్​ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది కేంద్రం. ఈ క్రమంలోనే దౌత్యవేత్తలు, ఉపాధి కోసం వెళ్లేవారు మినహా మిగిలినవారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణ నిబంధనల సమాచారం కోసం అమెరికాలో 24 గంటల హెల్ప్​లైన్లను ఏర్పాటు చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం.

వాషింగ్టన్​ డీసీలోని దౌత్యకార్యాలయం, హ్యూస్టన్​, న్యూయార్క్​, చికాగో, శాన్​ఫ్రాన్సిస్కోల్లోని రాయబార కార్యాలయాల్లో హెల్ప్​లైన్​ నంబర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. బెర్ముడా, డెలావేర్, కొలంబియా, కెంటుకీ, మేరీల్యాండ్​, నార్త్​ కరోలినా, వర్జీనియా, వెస్ట్​ వర్జీనియా ప్రాంతాలవారు 202-213-1364, 202-262-0375 నంబర్లను సంప్రదించవచ్చు లేదా cons4.washington@mea.gov.inకు మెయిల్​ చేయవచ్చు.

న్యూయార్క్​లో ఉండే వారు 347-721-9243, 212-774-0607 లేదా visa.newyork@mea-gov.inను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్​ వారికోసం 415-483-6629 లేదా oci2.sf@mea.gov.in ఏర్పాటు చేశారు.

గత ఏడాది డిసెంబర్​లో చైనా వుహాన్​లో ఉద్భవించిన వైరస్​.. ప్రపంచవ్యాప్తంగా 124,330 మందికి సోకింది. 4,600మంది ప్రాణాలను బలిగొంది. ​భారత్​లో 74మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరించగా.. తొలి కరోనా మరణం గురువారం నమోదైంది.

ఇదీ చూడండి: కెనడా ప్రధాని సతీమణికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.