ETV Bharat / international

కరోనా వల్ల వీరికి 12రెట్లు ప్రమాదం ఎక్కువ! - కరోనా మరణాల రేటు

యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ప్రకారం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న కరోనా రోగుల్లో మరణాల రేటు 12 రెట్లు అధికంగా ఉంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలున్నవారికి కరోనా ముప్పు అధికమని సీడీసీ నివేదిక పేర్కొంది.

Coronavirus death rate is higher for those with chronic ills
వీరికి కరోనా వల్ల 12 రెట్లు ప్రమాదం ఎక్కువ!
author img

By

Published : Jun 16, 2020, 7:58 PM IST

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న కరోనా రోగుల్లో మరణాలు రేటు 12 రెట్లు అధికంగా ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. హృద్రోగ సమస్యలు, మధుమేహం, ఊపరితిత్తుల సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తెలిపింది.

జనవరి 22 నుంచి మే 31 వరకు 1.3 మిలియన్ కొవిడ్ బాధితులపై చేసిన పరిశోధన ఆధారంగా సీడీసీ ఈ నివేదిక రూపొందించింది. రోగుల్లో 33 శాతం మందికి హృద్రోగ సమస్యలు, 30 శాతం మందికి మధుమేహం, 18 శాతం మందికి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

కరోనా సోకి మరణించిన వారిలో.. ఆరోగ్యవంతులు 2 శాతం ఉండగా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 20 శాతం మంది ఉన్నారని నివేదిక పేర్కొంది. వైరస్ సోకి ఆసుపత్రుల్లో చేరిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 46 శాతం వరకు ఉన్నారని సీడీసీ తెలిపింది. ఈ గణాంకాలు ఆధారంగా చూస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా ముప్పు అధికంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: భారత్- చైనా బలాబలాల్లో ఎవరిది పైచేయి?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.