ETV Bharat / international

'పెర్ల్​ హార్బర్​, 9/11 కన్నా దారుణమైన దాడి ఇది'

పెర్ల్​ హార్బర్​, 9/11 ఘటనల కన్నా అమెరికాపై జరిగిన కరోనా వైరస్​ దాడి ఎంతో దారుణమని అధ్యక్షుడు ట్రంప్​ తెలిపారు. ఇది కంటికి కనపడని శత్రువుతో జరుగుతున్న యుద్ధంగా పేర్కొన్నారు.

Coronavirus attack worse than Pearl Harbour, 9/11: Trump
'పర్ల్​ హార్బర్​, 9/11 కన్నా దారుణమైన దాడి ఇది'
author img

By

Published : May 7, 2020, 8:30 AM IST

కరోనా వైరస్​ రూపంలో అమెరికాపై జరిగిన దాడి.. పెర్ల్​ హార్బర్​, 9/11 ట్విన్​​ టవర్స్​ ఘటనల కన్నా ఎంతో దారుణమని అ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తెలిపారు. శ్వేతసౌధంలో జరిగిన ఓ సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్​.

"దేశంలో ఎన్నడూ లేనంత దారుణమైన దాడి జరిగింది. దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దాడి. పెర్ల్​ హార్బర్​ కన్నా ఇది దారుణం. వరల్డ్​ ట్రేడ్​ సెంటర్​ ఘటన కన్నా ఇది దారుణం. ఇలాంటి దాడి అసలు ఎప్పుడు జరగలేదు."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

కంటికి కనపడని శత్రువు(కరోనా వైరస్​)ను యుద్ధంలా పరిగణిస్తున్నట్టు తెలిపిన ట్రంప్​.. అమెరికాలోకి ప్రవేశించే ముందే దాన్ని నివారించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

"పెర్ల్​ హార్బర్​ కన్నా ఎక్కువ మందిని ఇది(వైరస్​) చంపింది. వరల్డ్​ ట్రేడ్​ సెంటర్​ ఘటన కన్నా ఎక్కువ మందిని బలిగొంది. అందులో దాదాపు 3వేల మంది మరణించారు. అందుకే ఇదొక యుద్ధం. ఇది ఎంతో శక్తిమంతమైన శత్రువు. మనం ఇలాంటి వాటిపై పైచేయి సాధిస్తాం. ఇదొక కంటికి కనపడని శత్రువు. అయిప్పటికీ మనం చాలా మెరుగ్గా పనిచేస్తున్నాం."

'టాస్క్​ఫోర్స్​ ప్రస్తుతానికి...'

శ్వేతసౌధంకు చెందిన టాస్క్​ఫోర్స్​ ప్రస్తుతానికి పని చేస్తుందని ట్రంప్​ స్పష్టం చేశారు. అందులో కొత్త సభ్యులు చేరతారని వెల్లడించారు. టాస్క్​ఫోర్స్​కు స్వస్తి చెప్పనున్నట్టు ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ తెలిపిన ఒక రోజు వ్యవధిలోనే.. అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

"కొంత కాలం వరకు టాస్క్​ఫోర్స్​ నడుస్తుంది. కానీ దాన్ని మూసివేయడం కోసం ఎదురుచూస్తా. టాస్క్​ఫోర్స్​ ఎంతో కీలక పాత్ర పోషించింది. అయితే దాన్ని త్వరగా మూసివేయాలనుకున్నా. కానీ అది ఎంత ప్రసిద్ధి చెందిందో నిన్న జరిగిన సమావేశంలో తెలిసింది. టాస్క్​ఫోర్స్​ను కొనసాగించాలని చాలా మంది నన్ను సంప్రదిస్తున్నారు. ఈ టాస్క్​ఫోర్స్​ను అందరూ గౌరవిస్తున్నారు."

చైనాపై...

ఈ ఏడాది జనవరిలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పంద నిబంధనలకు చైనా ఏ మేరకు కట్టుబడి ఉందో.. ఒకటి-రెండు వారాల్లో నివేదిక అందించనున్నట్టు ట్రంప్​ వెల్లడించారు. తొలి దశ ఒప్పందంలో చైనా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందా? అన్న ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్​.

అయితే కరోనా వైరస్​ నేపథ్యంలో చైనాపై సుంకాలు​ విధిస్తారా? అన్న ప్రశ్నకు ట్రంప్​ సమాధానమివ్వలేదు. ఆ విషయంపై ఇప్పడప్పుడే స్పందించలేనని తెలిపారు.

ఇదీ చూడండి:- అమెరికాలో చైనా పరిశోధకుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.