ETV Bharat / international

కరోనాతో 40శాతం  జీవజాతులకు పెనుముప్పు

కరోనా మహమ్మారితో మానవులకే కాదు అనేక జీవజాతులకు ముప్పుందని తేల్చారు కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు. అంతే కాదు, కొవిడ్ విజృంభణతో దాదాపు 40 శాతం జాతులు అంతరించిపోయే అవకాశముందని హెచ్చరించారు.

Corona virus threat to animals: 40 percent animals may disappear with covid-19 infection
కరోనాతో 40 జీవజాతులు అంతరించిపోతాయి!
author img

By

Published : Aug 24, 2020, 8:30 AM IST

కరోనా వైరస్ ముప్పు మానవులకే పరిమితం కాదని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తీవ్రస్థాయిలో అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న అనేక వానర జాతులకూ ఈ మహమ్మారితో ప్రమాదం ఉందని తేల్చారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జీవజాతులపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే అంశంపై పరిశోధన చేపట్టారు. మానవుల కణజాలాల్లోకి ప్రవేశించడానికి కరోనా వైరస్ ఏసీఈ2 గ్రాహక ప్రోటీన్ వినియోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వివిధ జీవ జాతుల్లో ఈ ప్రోటీన్ నిర్మాణ తీరును పరిశీలించడానికి జన్యు విశ్లేషణ చేపట్టారు. ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లోని పైపూత సహా అనేక కణాలు, కణజాలాల్లో ఈ ప్రోటీన్ ఉంటుంది.

ఏసీఈ2లో అనేక రకాల అమినో ఆమ్లాలు ఉంటాయి. వీటిలో 25ఆమ్లాలు కరోనా కారక వైరస్ మానవ కణాల్లో ప్రవేశించించడానికి వీలు కల్పిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, ఎన్ని జీవజాతుల్లో ఈ రకాలు ఉన్నాయనే కోణంలో దృష్టి సారించారు. ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉన్న జీవజాతుల్లో 40 శాతం జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మానవులతో పాటు, జంతువుల ఆరోగ్యాలపైనా దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు శాస్త్రవేత్తలు.

ఇదీ చదవండి: 'ఈ ఏడాది వ్యాక్సిన్ వస్తుందనుకుంటే మూర్ఖత్వమే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.