ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మహావిలయం కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి నేటి ఉదయం వరకు 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాదాపు 10వేల మంది వరకు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 75 లక్షలకు, మరణాలు 9 లక్షలకు చేరువయ్యాయి.
- మొత్తం కేసులు: 27,485,488
- మరణాలు: 896,842
- కోలుకున్నవారు: 19,587,099
- యాక్టివ్ కేసులు: 7,001,547
అమెరికాలో..
అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి తగ్గముఖం పట్టినట్లు కనిపిస్తోంది. సోమవారం కొత్తగా 25వేల కేసులు నమోదయ్యాయి. 284 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 64.85లక్షలకు చేరగా.. మరణాలు 2 లక్షలకు చేరువయ్యాయి.
బ్రెజిల్లో లక్షా 27వేలు దాటిన మరణాలు
బ్రెజిల్లో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. సోమవారం 10వేలకుపైగా కొత్త కేసులు రాగా 310 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41.47 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 1.27లక్షల మార్కును దాటింది.
ఈజిప్ట్‌లో లక్ష దాటిన కేసులు
ఈజిప్ట్‌లో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 5,541 మంది మరణించగా.. 79 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు ఇలా..
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 64,85,575 | 1,93,534 |
బ్రెజిల్ | 40,47,794 | 1,27,001 |
రష్యా | 10,30,690 | 17,871 |
పెరు | 6,91,575 | 29,976 |
కొలంబియా | 6,71,848 | 21,615 |
దక్షిణాఫ్రికా | 6,39,362 | 15,004 |
మెక్సికో | 6,37,509 | 67,781 |