ETV Bharat / international

ట్రంప్​Xబైడెన్​ : అధ్యక్షుడి వైఫల్యం వల్లే కేసులు పెరిగాయా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య రెండో సంవాదం ఆసక్తికరంగా సాగింది. చర్చలో భాగంగా కరోనా అంశంపై చర్చ రసవత్తరంగా జరిగింది. అయితే ట్రంప్​ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయగా.. బైడెన్​ విమర్శల దాడికి దిగారు.

Conversation between Biden and Trump on the Corona issue
అధ్యక్షుడి వైఫల్యం వల్లే కరోనా కేసులు పెరిగాయా?
author img

By

Published : Oct 23, 2020, 7:35 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య రెండో సంవాదంలో కరోనా అంశంపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా బైడెన్​.. ట్రంప్​పై విమర్శల దాడికి దిగారు. ట్రంప్‌ ప్రభుత్వం వైఫల్యం వల్లే కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉందంటూ విమర్శలు గుప్పించారు. అయితే ట్రంప్​ మాత్రం ఈ విషయంలో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

"చైనా నుంచి వచ్చిన ఈ కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థనే కొన్నాళ్ల పాటు మూసివేశాం. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య (కరోనా వైరస్‌) ప్రపంచం మొత్తం ఉంది. ఇదో ప్రపంచ మహమ్మారి. అయితే ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో నా ప్రభుత్వం తీసుకున్న చర్యలను చాలామంది దేశాధినేతలు ప్రశంసించారు. మనకు వ్యాక్సిన్ త్వరలోనే వస్తుంది. సిద్ధమవుతోంది. కొద్దివారాల్లో దీనిమీద ప్రకటన వస్తుంది. పంపిణీకి కూడా అన్ని సిద్ధం చేశాం. సైన్యం ఈ వ్యాక్సిన్ పంపిణీని నిర్వహిస్తుంది.”

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

బైడెన్​ మాత్రం ట్రంప్​పై విమర్శల దాడి కొనసాగించారు. కరోనాను ఎదుర్కోవడానికి ట్రంప్‌ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదన్నారు​. కరోనా విషయంలో ట్రంప్‌ చాలా ఆలస్యంగా మేల్కొన్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించలేదని ఆరోపించారు.

''చైనా నుంచి రాకపోకలపై ట్రంప్​ సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదు. కరోనా ప్రమాదకారి అని ఇంతవరకు ట్రంప్​ చెప్పకపోవడం శోచనీయం. ఇప్పటికీ వైరస్​ వల్ల ప్రమాదం లేదనే ట్రంప్​ చెప్పడం విడ్డూరంగా ఉంది.''

- జో బైడెన్​, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి

ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుపడకుండా తాజా చర్చలో మైక్‌ను కట్‌ చేసేలా మ్యూట్‌ బటన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో అభ్యర్థుల మధ్య ఎలాంటి రసాభాస చోటుచేసుకోలేదు. పైగా ఒక్కో అంశంపై స్పందించడానికి ఒక్కొక్కరికీ ఏకధాటిగా రెండు నిమిషాల సమయం కేటాయించారు.

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు బహిరంగంగా ముఖాముఖి చర్చించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ చర్చలను 'కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్'(సీపీడీ) నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి సంవాదం సెప్టెంబరు 29న జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే ట్రంప్‌ కరోనా బారినపడ్డారు. అనంతరం ఆయన కోలుకున్నప్పటికీ.. రెండో చర్చను వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ట్రంప్‌ విముఖత వ్యక్తం చేయడంతో దానిని రద్దు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.