ETV Bharat / international

అమెరికాలో కరోనా రిటర్న్స్​- రికార్డు స్థాయిలో కేసులు

అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 34 వేల 700 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి మొదలైన మొదట్లో గరిష్ఠంగా నమోదైన 36 వేల 400 కేసుల కంటే ఇవి కాస్త తక్కువ. ఈ నేపథ్యంలో మరో ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

'Coming back and biting us': US sees virus make a comeback '
అమెరికాలో కరోనా రిటర్న్స్​-రికార్డు స్థాయిలో కొత్త కేసులు
author img

By

Published : Jun 25, 2020, 11:53 AM IST

అగ్రరాజ్యం అమెరికాకు మరోసారి కరోనా ముప్పు పొంచి ఉందని అక్కడి ఆస్పత్రుల నిర్వాహకులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతుండటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ఒక్క రోజులోనే 34 వేల 700 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో గరిష్ఠంగా ఒక్క రోజే 36 వేల 400 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళన కల్గిస్తోంది.

వైరస్​ హాట్​స్పాట్లుగా ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుతున్నాయి. అరిజోనా, కాలిఫోర్నియా, మిసిసిప్పి, నెవడా, టెక్సాస్​లో రికార్డు స్థాయిలో బాధితులు పెరుగుతున్నారు. ఆస్పత్రులలో పడకలు ఖాళీలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదముంది.

కరోనా మళ్లీ విజృంభిస్తుందనే భయాలతో అమెరికా స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీగా పడిపోయాయి.

రికార్డు స్థాయిలో...

  • ఫ్లోరిడాలో ఒక్క రోజే 5వేల500 కేసులు వెలుగుచూశాయి. గత వారం నమోదైన రికార్డు కంటే ఇది 25 శాతం అధికం. రెండు వారాల క్రితం రికార్డుతో పోల్చితే మూడు రెట్లు అధికం.
  • మే 1 నుంచే లాక్​డౌన్​ ఆంక్షలు సడలించిన టెక్సాస్​లో.. ఆస్పత్రులలో చేరే వారి సంఖ్య రెట్టింపు అయింది. కొత్త కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఇక్కడ 8 ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో 20 శాతం మందికి పాజిటివ్​గా తేలుతోంది. మే మధ్యకాలంలో ఇది కేవలం 2 నుంచి 4 శాతం మాత్రమే ఉండేది.
  • కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉంచనున్నట్లు న్యూయార్క్​, న్యూ జెర్సీ ప్రకటించాయి.

నిపుణుల ఆందోళన

కరోనా వైరస్​ను ప్రజలు తేలిగ్గా తీసుకోవడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని హ్యూస్టన్​ మెథడిస్ట్​ హాస్పిటల్​ సీఈవో డా.మార్క్​ బూం ఆందోళన వ్యక్తం చేశారు. రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాల్లో కనీస జాగ్రత్తలు పాటించకుండా ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటం ఆందోళ కలిగిస్తుందన్నారు. అందరూ సమష్టిగా కృషి చేసినప్పుడే వైరస్​ను నిలువరించగమలని స్పష్టం చేశారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది వారాల్లోనే ఆస్పత్రులలో పడకల సామర్థ్యం కంటే రోగుల సంఖ్యే ఎక్కువయ్యే ప్రమాదం ఉందని అరిజోనా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.జోసేఫ్​ గెరాల్డ్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఊహించని స్థాయిలో మరణాలు ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు నూతన ఆంక్షలు విధించాలని ఆయన చేసిన వినతిని అరిజోనా గవర్నర్​ తిరస్కరించారు.

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో లక్షా 24 వేల 281 మంది మరణించారు. 24 లక్షల 62 వేల 554 మంది వైరస్ బారినపడ్డారు.

ఇదీ చూడండి: ప్రధానికి షాక్- ప్రతిపక్ష పార్టీలోకి తమ్ముడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.