ETV Bharat / international

కరోనా 2.0పై చైనా విజయం.. కానీ! - కరోనా వైరస్​ మృతులు

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్​ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకు 93,82,647 మంది వైరస్​ బారినపడ్డారు. 4,80,406 మంది మృతి చెందారు. అయితే కరోనా రెండో దఫాను చైనా విజయవంతంగా కట్టడి చేసినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా 11రోజుల్లో 25లక్షలమందికి వైరస్​ పరీక్షలు నిర్వహించి.. ప్రపంచ దేశాలకు మరోసారి తన సామర్థ్యాన్ని చాటిచెప్పింది. అటు మెక్సికో, అమెరికాల్లో వైరస్​ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

China tames new outbreak but elsewhere virus cases surge
ప్రపంచవ్యాప్తంగా 94లక్షలకు చేరువలో కరోనా కేసులు
author img

By

Published : Jun 24, 2020, 6:04 PM IST

ప్రపంచంపై కరోనా వైరస్​ పంజా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ కేసులు 94లక్షలకు చేరువయ్యాయి. ప్రస్తుతం 93,82,647 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 4లక్షల 80వేల 406మంది వైరస్​ ధాటికి బలయ్యారు.

దేశంకేసులుమరణాలు
అమెరికా2,424,4931,23,476
బ్రెజిల్11,51,47952,771
రష్యా6,06,8818,513
బ్రిటన్3,06,21042,927
స్పెయిన్2,93,83228,325
పెరూ2,60,8108,404
చిలీ2,59,7674,505
ఇటలీ2,,38,83334,675
ఇరాన్2,12,5019,996

చైనా మరోసారి...

రాజధాని బీజింగ్​లో విజృంభించిన రెండో దఫా వైరస్​ను చైనా విజయవంతంగా కట్టడి చేసినట్టు కనిపిస్తోంది. చైనావ్యాప్తంగా మంగళవారం 22 కేసులు నమోదుకాగా.. బుధవారం ఆ సంఖ్య 12కు పడిపోయింది. బీజింగ్​లో కేవలం 7 కేసులే నమోదయ్యాయి.

నగరంలో 11 రోజుల్లోనే దాదాపు 2.5 మిలియన్​ మందికి పరీక్షలు నిర్వహించి.. ప్రపంచ దేశాలకు తన సామర్థ్యాన్ని మరోమారు చాటిచెప్పింది చైనా.

మెక్సికో విలవిల...

వైరస్​తో మెక్సికో విలవిలలాడుతోంది. పరీక్షలు తక్కువగా జరుగుతున్నప్పటికీ.. రోజూ వేలల్లో కేసులు బయటపడుతున్నాయి. తాజాగా 6వేల 200కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,410కు పెరిగింది. మరో 793మంది మరణించగా.. ఇప్పటివరకు వైరస్​ సోకి 23,377మంది మృతిచెందారు.

అమెరికాలో పెరుగుతున్న కేసులు...

అమెరికాలో వైరస్​ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా అనేక రాష్ట్రాల్లో కేసులు.. ఏప్రిల్​లో నమోదైన అత్యధిక కేసుల స్థాయికి చేరుకున్నాయి. ఆరిజోనా, కాలిఫోర్నియా, నేవాడ, టెక్సాస్​ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూశాయి.

పాకిస్థాన్​లో విజృంభణ...

పాకిస్థాన్​లో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. 24గంటల వ్యవధిలో 3,892కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,88,926కు చేరింది. తాజాగా 60మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3,755మంది కరోనా బారినపడి మరణించారు.

జపాన్​లో ఇలా..

జపాన్​ రాజధాని టోక్యోలో తాజాగా 55 కేసులు బయటపడ్డాయి. మే నెల తొలి వారం నుంచి ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. అయినప్పటికీ వ్యాపారాలపై ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశారు. జపాన్​వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 17,968కు చేరగా... వైరస్​తో 955మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:- 'కరోనాపై పోరులో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.