కరోనా విపత్తుకు చైనా బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేస్తోన్న అమెరికా తాజాగా మరోసారి ధ్వజమెత్తింది. కరోనా వ్యాక్సిన్ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని తమ నుంచి దొంగిలించడానికి చైనా ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో.
"చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న సైబర్ నేరగాళ్లు.. అమెరికాకు చెందిన మేధో సంపత్తి, కొవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధన సమాచార చౌర్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చైనా ఉద్దేశ్యపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పడుతుంది. సురక్షిత, సమర్థవంతమైన చికిత్స పరిశోధనను దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోంది." -మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి
వైరస్ పోదు..
అమెరికా ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. తమపై అసత్య ప్రచారం చేసినంత మాత్రాన వైరస్ పోదని బదులిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది మహమ్మారి కరోనా. ఇందులో అత్యధికంగా అమెరికాలోనే మృతి చెందారు.
ఇదీ చూడండి: చైనాతో తెగతెంపులకు సిద్ధమే: ట్రంప్