ETV Bharat / international

'ప్రపంచానికి చైనా పెనుముప్పుగా తయారైంది' - చైనా అమెరికా వార్తలు

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు చైనా పెనుముప్పుగా తయారైందని అమెరికా నిఘా విభాగం డైరెక్టర్​ రాట్​క్లిఫ్​ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో మేటి ఆర్థిక వ్యవస్థగా, సైనిక, సాంకేతిక రంగంలో మేటి దేశంగా ఎదగడానికి చైనా ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. చైనా ప్రభావాన్ని అమెరికా దీటుగా ఎదుర్కోవాలని రాట్​ అభిప్రాయపడ్డారు.

China
ప్రపంచానికి చైనా పెనుముప్పుగా తయారైంది
author img

By

Published : Dec 4, 2020, 12:13 PM IST

ప్రపంచాన్ని శాసించాలని ఆశపడుతున్న చైనాను నిలువరించాలంటే అమెరికా దీటుగా స్పందించాలని ఆ దేశ నిఘా విభాగం డైరెక్టర్​ రాట్​క్లిఫ్​ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా ప్రపంచ ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు పెను ముప్పుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

"అమెరికాతో పాటు ప్రపంచదేశాలకు చైనా పలు సవాళ్లు విసురుతోంది. అమెరికా ప్రజలు దీన్ని నిశితంగా పరిశీలించాలి. ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థ, సైనిక, సాంకేతిక రంగంలో మేటిగా ఎదగడమే చైనా అంతిమ లక్ష్యం. ఈ పరిస్థితుల్లో చైనాను అమెరికా నిలువరించాలి. అమెరికాకు 500 బిలియన్​ డాలర్ల నష్టాన్ని చేయడమే కాకుండా చైనా మన మోధో సంపత్తిని, సాంకేతికతను అపహరిస్తోంది."

- రాట్​క్లిఫ్​, అమెరికా నిఘా విభాగం డైరెక్టర్

అమెరికా దిగ్గజ కంపెనీలకు చెందిన మోథో సంపత్తిని చోరీ చేసి ఆ స్థానంలో తన సంస్థలను ప్రత్యామ్నాయంగా నిలిపే ప్రయత్నం చైనా చేస్తోందని రాట్​ అన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్​ సర్కార్​ చైనాపై పలు ఆంక్షలు విధించిందని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల చైనా కమ్యూనిస్ట్​ పార్టీ నేతలు, అధికారులకు ఇచ్చే ఆతిథ్య వీసాల కాలపరిమితిని 10 ఏళ్ల నుంచి నెలకు తగ్గించింది ట్రంప్​ ప్రభుత్వం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.