చిలీలోని శాంటియాగోలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తూ.. అదే మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయిన తమ సహోద్యోగినికి ఘనంగా కడసారి వీడ్కోలు పలికారు ఓ ఆస్పత్రి సిబ్బంది. ప్రత్యేకంగా అలంకరించిన కారులో మృతదేహాన్ని ఉంచి ఖననం చేసేందుకు పంపించారు. తమ సహచరిణిని సాగనంపుతూ కంటనీరు తెచ్చుకున్నారు. స్నేహితురాలు ఉన్న కారు వెనక కాన్వాయ్లా తరలివెళ్లారు.
ఆస్పత్రి నిర్లక్ష్యంతోనే..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ సహచరిణిని.. పూర్తిస్థాయిలో కోలుకోకుండానే యాజమాన్యం డిశ్ఛార్జి చేసిందని ఆరోపించారు సహోద్యోగులు. వైరస్ నయమైందన్న భావనలో ఆమె ఉండగా శరీరంలో వ్యాధి తీవ్రమై ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. తమ సహచరిణిని కోల్పోయేందుకు ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమన్నారు. వైద్య సిబ్బంది కరోనా బారినపడకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్న అమెరికా