ETV Bharat / international

పుర్రెలను ప్రార్థించే పండగ.. ఎక్కడంటే?

అక్కడ పుర్రెలను భద్రంగా ఇంట్లో దాచుకుంటారు. ఏడాదికోసారి బయటకు తీసి ప్రార్థనలు చేస్తారు. తమకు మంచి జరగాలని పుర్రెలను వేడుకుంటారు. కపాలం నోట్లో సిగరేట్లు పెట్టి వాటి ముందు కొవ్వొత్తి పెట్టి అభిమానాన్ని చాటుకుంటారు. పుర్రెలను అందంగా అలంకరించి వాటిని ప్రార్థిస్తే అంతా మంచే జరుగుతుందని ఆ దేశ ప్రజలు విశ్వసిస్తారు.

Bolivia skull festival
స్కల్ ఫెస్టివల్
author img

By

Published : Nov 9, 2021, 4:55 PM IST

స్కల్ ఫెస్టివల్

ఆ దేశంలో మానవ పుర్రెలను ఇంట్లో అత్యంత భద్రంగా దాచుకుంటారు. ఆ పుర్రెలో మరణించిన తమ వారి ఆత్మ ఉంటుందని భావిస్తారు. తమ కష్టాలను కపాలానికి మొర పెట్టుకుని.. మంచి జరగాలని వేడుకుంటారు. ఏడాదికోసారి పుర్రెలను అందంగా అలంకరించి పండుగ చేసుకుంటారు.

చనిపోయిన వారి ప్రతిరూపంగా..

బొలివియా(Bolivia skull festival) రాజధాని లా పాజ్‌లో స్కల్‌ ఫెస్టివల్‌ను వైభవంగా జరుపుకున్నారు. కుటుంబంలో చనిపోయిన వారి ప్రతిరూపంగా దాచుకున్న కాపాలాలను అందంగా అలంకరించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది నవంబర్‌ నెల ఆరంభంలో బొలివియాలోని ఐమారా ప్రజలు నటిటాస్‌ పేరుతో ఈ వేడుక నిర్వహిస్తారు. కుటుంబంలో చనిపోయిన వారి పుర్రెలను పూలతో అందంగా అలంకరించి ఆరాదిస్తారు. ప్రతీ వ్యక్తికి ఏడు ఆత్మలుంటాయని.. అందులో ఒకటి మానవ పుర్రె లోపల ఉంటుందని భావించి ప్రార్థనలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమను ఆ పుర్రెలోని ఆత్మ రక్షిస్తుందని.. మంచి జరిగేలా చూస్తుందని భావిస్తారు. ఈ వేడుకలో భాగంగా కపాలాలను అందమైన దండలు, టోపీలు, వివిధ ఉపకరణాలతో సుందరంగా అలంకరిస్తారు.

పుర్రెలకు ప్రార్థనలు..

స్కల్‌ ఫెస్టివల్‌లో(Bolivia skull festival) భాగంగా పుర్రెలను తమ కుటుంబాలు భద్రంగా దాచుకుంటాయి. వాటిని ప్రార్థనాలయాలకు తీసుకెళ్లి ప్రార్థనలు చేస్తారు. మరణించిన వారి ప్రతిరూపంగా వీటిని తాము భావిస్తామని ఐమారా ప్రజలు వెల్లడించారు. పుర్రెల నోట్లో సిగరెట్లు పెట్టి, వాటి ముందు కొవ్వొత్తి పెట్టి నివాళులు అర్పిస్తారు.

తరతరాల సంప్రదాయం..

ఈ సామూహిక వేడుకల్లో(Bolivia skull festival) పవిత్ర జలంతో కపాలాలను శుభ్రపరుస్తారు. మతపరమైన పూజలు నిర్వహిస్తారు. తరతరాలుగా తాము ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నామని.. ఇలా చేయడం వల్ల తమకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందని స్థానిక ప్రజలు తెలిపారు.

ఇదీ చూడండి: పాఠశాలలో అగ్నిప్రమాదం.. 20 మంది చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.