అమెరికాలో కరోనా టీకా పంపిణీ వ్యూహాలపై చర్చించేందుకు వ్యాధి నియంత్రణ కేంద్రం సలహాదారుల బృందం మంగళవారం భేటీ కానుంది. టీకాకు ఆమోదం లభించిన తర్వాత జనాభా సమూహాల ప్రాధాన్యం, ఎన్ని డోసులు, ఎంత మేర సరఫరా చేయాలన్న అంశాలపై సమాలోచనలు చేయనుంది.
ఈ మేరకు ఎవరికి ముందుగా వ్యాక్సిన్ అందించాలన్న విషయాన్ని సలహాదారుల సిఫార్సు చేయనున్నారు.
తొలి ప్రాధాన్యం వీరికే..
టీకా అందుబాటులోకి రాగానే మొదట ఆరోగ్య కార్యకర్తలకు ఇవ్వాలని ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నారు. నిత్యవసర వస్తువుల పరిశ్రమలలోని కార్మికులు, అనారోగ్య పరిస్థితులతో ఉన్నవారు, 65ఏళ్లకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు టీకాలు..
ఇప్పటికే ఫైజర్-బయోఎన్‌టెక్ ద్వయం.. తమ కరోనా టీకా క్యాండిడేట్‌ను అత్యవసరంగా ఉపయోగించడానికి అనుమతించమని ఎఫ్‌డీఏను కోరింది. మోడెర్నా సంస్థ కూడా త్వరలో దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'టీకా రాకపోతే ఆఫీసుకు వెళ్లేదెలా?'