ఎన్బీఏ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న బాస్కెట్‌బాల్ జట్టు రాప్టర్స్ కెనడాలోని టొరెంటోలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. వేలాది మంది పాల్గొన్న ఈ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. కొందరు విచక్షణారహితంగా పరుగులు పెట్టి గందరగోళం సృష్టిండడం వల్ల అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని, మరో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
ఎన్బీఏ ఛాంపియన్షిప్ సాధించిన రాప్టర్స్ జట్టు ట్రోఫీతో సహా ఊరేగింపుగా వెళ్లింది. 1993లో టొరెంటో బ్లూజేస్ జట్టు వరల్డ్ సిరీస్ గెలిచింది. మరోసారి ఇప్పుడు రాప్టర్స్ అంత ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఆ జట్టు సభ్యులను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వీధుల్లోకి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన అభినందన సభలో జట్టు సభ్యులతోపాటు, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు.
ఇంతలో కొంతమంది అభిమానులు పరుగెత్తడం వల్ల... సభా ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. పోలీసులు కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం కార్యక్రమం సజావుగా సాగింది.
ఇదీ చూడండి: బిహార్‌కు మరో ఉన్నత స్థాయి వైద్య బృందం