ETV Bharat / international

అమెరికాలో కార్చిచ్చు విధ్వంసం- 500 ఎకరాలు దగ్ధం! - అమెరికాలో కార్చిచ్చు విధ్వంసం- 500 ఎకరాలు దగ్ధం!

అమెరికాలో భారీగా మంటలు చెలరేగాయి. దక్షిణ కాలిఫోర్నియాలో 500 ఎకరాలకు అగ్నికీలలు వ్యాప్తి చెందాయి. మంటలను ఆర్పేందుకు హెలికాఫ్టర్లతో నీళ్లు చల్లుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నారు.

Brush fire burning in California - homes being evacuated
అమెరికాలో కార్చిచ్చు విధ్వంసం- 500 ఎకరాలు దగ్ధం!
author img

By

Published : Oct 27, 2020, 5:34 AM IST

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రజల నివాస ప్రాంతాల్లో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నారు.

అమెరికాలో కార్చిచ్చు విధ్వంసం

భారీగా చెలరేగిన అగ్నికీలలు.. 500 ఎకరాలకు వ్యాప్తి చెందాయని స్థానిక మీడియా తెలిపింది. మంటలు ఆర్పేందుకు హెలికాప్టర్లతో నీటిని వెదజల్లుతున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలో గాలులు వేగంగా వీస్తున్నాయని అక్కడి వాతావరణ విభాగం తెలిపింది. దీంతో నిప్పు రవ్వలతో ఆ ప్రాంతంలోని అటవీ భూములకు ఈ మంటలు వ్యాప్తి చెందుతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లాస్‌ ఎంజిల్స్‌లోని పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యవసర నోటీసును జారీ చేశారు అధికారులు. 60 వేల మందిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.