అమెరికాలోని న్యూయార్క్ వేదికగా నిర్వహిస్తున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సర్వసభ్య సమావేశంలో(unga session 2021) కరోనా కేసు వెలుగు చూసింది. బ్రెజిల్ ఆరోగ్య మంత్రి(brazil health minister) మార్సిలో క్వైరోగాకు వైరస్ సోకినట్లు తేలింది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోతో(jair bolsonaro news) పాటు ఈయన సదస్సులో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లారు.
అయితే బ్రెజిల్ ప్రతినిధుల బృందంలోని మిగతా వారందరికీ నెగెటివ్‌గా తేలినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం తెలిపింది. ప్రస్తుతం క్వైరోగా క్వారంటైన్లో ఉన్నారని, 14 రోజులు పాటు న్యూయార్క్‌లోనే ఉంటారని పేర్కొంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కరోనా కారణంగా ఐరాస సర్వసభ్య సమావేశాన్ని(unga summit 2021) గతేడాది వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సారి మాత్రం ఆయా దేశాల నాయకులు ప్రత్యక్షంగా హాజరవుతున్నారు. సెప్టెంబర్ 21 నుంచి 27వరకు ఈ సదస్సు జరగనుంది.
బ్రెజిల్ ఆరోగ్య మంత్రి మార్సిలో.. చైనా అభివృద్ధి చేసిన కరోనావ్యాక్ టీకాను తీసుకున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే ఎప్పుడు తీసుకున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
అమెరికాలో కరోనా కేసులు ఇంకా అధికంగా వెలుగుచూస్తున్నందున ఈసారి కూడా సదస్సును(unga 2021) వర్చువల్‌గానే నిర్వహించాలని భావించారు. కానీ పలు దేశాల ప్రతిపాదన మేరకు ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. 100కు పైగా దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో ఈ సమావేశం కరోనాకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోకుండానే సదస్సుకు హాజరవుతున్నారు.
ఇదిలా ఉంటే బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా పట్ల మొదటి నుంచి నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. తాను టీకా వేయించుకోనని తేల్చి చెప్పారు. కరోనా బారినపడి కోలుకున్నా కూడా తన వైఖరిలో మార్పు రాలేదు.
ఇదీ చదవండి: కొవిషీల్డ్‌ను యూకే ఆమోదించినా.. క్వారంటైన్‌లోనే భారత ప్రయాణికులు!