ETV Bharat / international

బ్రెజిల్​లో 4 లక్షలు దాటిన కరోనా మరణాలు - world corona cases online

బ్రెజిల్‌లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రోజుకు సగటున 3,100 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల రోజుల్లోనే లక్షమంది మహమ్మారి కాటుకు బలయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

Brazil deaths
బ్రెజిల్ మరణాలు
author img

By

Published : Apr 30, 2021, 9:11 AM IST

బ్రెజిల్‌లో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. నెల రోజుల వ్యవధిలో బ్రెజిల్‌లో దాదాపు లక్ష మంది కొవిడి కాటుకు బలికాగా.. ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో.. అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశం బ్రెజిలే కావడం గమనార్హం. మున్ముందు పరిస్థితి.. మరింత క్లిష్టంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏప్రిల్‌లో బ్రెజిలియన్లను మహమ్మారి ఎన్నడూ లేనంతగా బలి తీసుకుందని.. గడచిన వారం రోజులుగా సరాసరిన రోజువారీ మరణాలు 3 వేల ఒక్క వందగా నమోదయ్యాయి. ఆస్పత్రులు కూడా కరోనా రోగులతో నిండి పోయాయి. గురువారం బ్రెజిల్‌లో 3 వేల ఒక్క మంది చనిపోగా.. మొత్తం మరణాలు 4,01,186 చేరినట్లు బ్రెజిల్ ఆరోగ్యశాఖ తెలిపింది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 15 కోట్ల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు.

మొత్తం కేసులు: 151,117,679

మొత్తం మరణాలు: 3,179,187

కోలుకున్న వారు: 128,510,730

యాక్టివ్​ కేసులు: 19,427,762

ఇవీ చదవండి: కరోనా విలయం: ఆ దేశాల్లో రికార్డు స్థాయి కేసులు

బ్రెజిల్​లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.