ETV Bharat / international

లైవ్​షో నడుస్తున్న స్టూడియోలో దోపిడీ - రేడియో స్టేషన్​లో దోపిడీ

బ్రెజిల్​లోని ఓ రేడియా స్టేషన్​లో లైవ్​ జరుగుతుండగానే స్టూడియోలోకి ప్రవేశించి కొందరు దొపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సిబ్బంది చరవాణిలు, గడియారాలు, ఇతర విలువైన నగలు, వస్తువులు దోచుకెళ్లారు.

లైవ్​షో నడుస్తున్న స్టూడియోలో దోపిడీ..!
author img

By

Published : Apr 4, 2019, 10:51 AM IST

లైవ్​షో నడుస్తున్న స్టూడియోలో దోపిడీ..!

బ్రెజిల్, సావో పౌలో సమీపంలోని జోర్డిమ్​లో ఓ రేడియో స్టేషన్​. అక్కడ ఓ షో లైవ్​ జరుగుతోంది. వ్యాఖ్యాత, అతిథులు మాట్లాడుతున్నారు. ఎంతో మంది లైవ్​లో వింటున్నారు. కొందరు ఇంటర్నెట్​లో ఆ కార్యక్రమాన్ని చూస్తున్నారు.

ఒక్కసారిగా ముగ్గురు దుండగులు తుపాకులతో స్టూడియోలోకి వచ్చారు. అందరినీ బెదిరించి నగలు, సెల్​ఫోన్లు, గడియారాలు దోచుకెళ్లారు. అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

లైవ్​ చూస్తున్న కొందరు వీక్షకులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు. ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.