ETV Bharat / international

బోయింగ్ 737మ్యాక్స్​కు త్రుటిలో తప్పిన ముప్పు

అమెరికాలోని ఓర్లాండ్​ విమానాశ్రయంలో బోయింగ్​ 737 మ్యాక్స్​ విమానం అత్యవసరంగా ల్యాండ్​ అయ్యింది. ఇంజిన్​ వైఫల్యమే ఇందుకు కారణం. ఈ ఘటనపై అమెరికా విమానయాన సంస్థ​ దర్యాప్తు చేపట్టింది.

ఫ్లోరిడాలో బోయింగ్ 737మ్యాక్స్ అత్యవసర ల్యాండింగ్​
author img

By

Published : Mar 27, 2019, 9:48 AM IST

Updated : Mar 27, 2019, 11:08 AM IST

బోయింగ్ 737మ్యాక్స్​కు త్రుటిలో తప్పిన ముప్పు
బోయింగ్​ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై అనిశ్చిచి కొనసాగుతోంది. తాజాగా అమెరికా ఫ్లోరిడాలోని ఓర్లాండో విమానాశ్రయంలో ఓ బోయింగ్​ 737 మ్యాక్స్​ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ విషయాన్ని అమెరికా విమానయాన సంస్థ​​ ధ్రువీకరించింది. విమానం లోపల ప్రయాణికులు లేకపోవడం, సరైన సమయానికి లాండ్​ అవ్వడం వల్ల ప్రమాదం తప్పింది.

ఇంజిన్​ వైఫల్యమే కారణం...

ఓర్లాండో నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో ఇంజిన్​ వైఫల్యం వల్ల అత్యవసరంగా ల్యాండ్​ చేయాల్సి వచ్చిందని సిబ్బంది తెలిపారు.

ఈ నెల 10న బోయింగ్​ 737 మ్యాక్స్​ విమానం ఇథియోపియాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా మృతి చెందారు. అనంతరం ఆ మోడల్​ విమానాలను అమెరికా సహా పలు దేశాలు నిషేధించాయి.

అప్పటి నుంచి అమెరికాలో ప్రయాణికులు లేకుండానే ఈ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ విమానాశ్రయాల నుంచి బోయింగ్​ విమానాలను ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 27, 2019, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.